శ్రేయస్ అయ్యర్ దూరం.. కోల్కతా జట్టు నెక్ట్ కెప్టెన్ అతడేనట?

praveen
2023 ఐపీఎల్ సీజన్ మార్చ్ 31వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే అన్ని జట్లు కూడా బలమైన టీం తో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయ్. ఇలాంటి సమయంలో అటు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాలనుకున్న కోల్కతా జట్టుకు ఊహించిన షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసి కెప్టెన్సీ అప్పగించిన శ్రేయస్ అయ్యర్ ఇక గాయం కారణంగా జట్టుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్లో గాయం బారిన పడ్డాడు శ్రేయస్ అయ్యర్.

అయితే అతను వెన్ను నొప్పి గాయానికి ఇక శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తుంది బీసీసీఐ. ఈ క్రమంలోనే సర్జరీ చేయాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తుంది. దీని బట్టి చూస్తే అతను ఐపిఎల్ సీజన్ కి అందుబాటులో ఉండడు. ఇక ఐపీఎల్లో కోల్కతా జట్టుకి అతను కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.  అయితే ఇక శ్రేయస్ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో జట్టు యాజమాన్యం కొత్త కెప్టెన్ కోసం వెతుకులాట ప్రారంభించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇక జట్టులో కీలక ప్లేయర్లుగా ఉన్న కొంతమంది ఆటగాళ్ల పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయ్ అని చెప్పాలి.

 కాగా ప్రస్తుతం కోల్కతా జట్టులో ఉన్న ఆల్ రౌండర్లు షకీబుల్ హసన్, సునీల్ నరైన్, రసేల్ ఇక కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు అనేది తెలుస్తుంది. అయితే అటు కోల్కతా యాజమాన్యం మాత్రం ఎక్కువగా విండీస్ ఆల్ రౌండర్ సునీల్ నరైన్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక త్వరలోనే దీనికి సంబంధించి ఇక జట్టు యాజమాన్యం అధికారిక ప్రకటన చేసేందుకు కూడా సిద్ధమైందట. అయితే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాత్రమే కాదు స్టార్ బౌలర్ పెర్ఫ్యూసన్, ఇక బ్యాట్స్మెన్ నితీష్ రానా సైతం గాయం కారణంగా జట్టుకు దూరం అవడంతో జట్టు ప్రణాళికలు మొత్తం తారుమారు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: