సూర్య మూడుసార్లు డకౌట్.. రోహిత్ ఏమన్నాడో తెలుసా?

praveen
భారత క్రికెట్లో ఎక్కడ చూసినా సూర్య కుమార్ యాదవ్ ఆట తీరు గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. టి20 ఫార్మాట్లో విధ్వంసకర ప్లేయర్గా మంచి గుర్తింపును సంపాదించుకున్న సూర్యకుమార్ వన్డే ఫార్మాట్లో విఫలమవుతూ ఉండటం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో  జరిగిన వన్డే సిరీస్లో అయితే సూర్య పూర్తిగా చేతులేత్తేసాడు అని చెప్పాలి. వరుసగా మూడు మ్యాచ్లలో కూడా భారీ అంచనాల మధ్య బ్యాటింగ్ కి వచ్చి మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ గా వెనుతిరిగాడు సూర్య కుమార్.

 కేవలం ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రమే కాదండోయ్ అంతకుముందు టీమిండియా తరఫున ఆడిన మిగతా వన్డే మ్యాచ్ లలో కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. మొత్తంగా ఇప్పటివరకు 23 వన్డే మ్యాచ్లు ఆడిన సూర్య కుమార్ యాదవ్ 24.05 సగటు 433 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. దీంతో ఇక సూర్య వన్డే ఫార్మాట్ కు సరిపోడు అంటూ ఎంతోమంది టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి సమయంలో అటు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం సూర్యకుమార్ కు మద్దతు పలికాడు అని చెప్పాలి.

 3 వన్డేల సిరీస్ లో భాగంగా సూర్య కుమార్ ఆడింది కేవలం 3 బంతులు మాత్రమే. అయితే అతని బ్యాడ్ టైం అలా ఉంది. కాబట్టే ప్రతి మ్యాచ్ లో కూడా మంచి బంతినే తొలి బంతిగా ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అతను 15 నుంచి 20 ఓవర్లు క్రీజులో నిలబడితే పరిస్థితి వేరుగా ఉంటుంది అంటూ ప్రశంసలు కురిపించాడు. గత రెండేళ్ల నుంచి అతను స్పిన్ బౌలర్ను అద్భుతంగా ఎదుర్కోవడం చూసామని.. ఈ ఒక్క సిరీస్ లో విఫలమైనంత మాత్రాన సూర్య ఆట తీరును తప్పు పట్టాల్సిన అవసరం లేదు అంటూ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: