మహమ్మద్ షమీ దెబ్బకు.. కంగుతిన్న ఆస్ట్రేలియా బ్యాటర్?

praveen
వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్లో టీమ్ ఇండియా ఫేసర్ మహమ్మద్ షమీ ఎంతలా నిప్పులు చెరిగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకరకంగా చెప్పాలి అంటే తన కెరీర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ కనబరిచాడు అని చెప్పాలి. ఏకంగా ఈ వన్డే మ్యాచ్లో 6 ఓవర్లు బౌలింగ్ చేసిన మహమ్మద్ షమీ కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అంతే కాదు కీలకమైన మూడు వికెట్లు తీసి ఇక ఆస్ట్రేలియాని కోలుకోలేని దెబ్బ కొట్టాడు అని చెప్పాలి. ఇక అతను వేసిన 6 ఓవర్లలో రెండు మేడిన్ ఓవర్లు కూడా ఉండడం గమనార్హం.

 దీన్నిబట్టి అటు మహమ్మద్ సమీ మొదటి వన్డే మ్యాచ్ లో ఎంత అద్భుతమైన బౌలింగ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాకుండా మహమ్మద్ షమీ పడగొట్టిన మూడు వికెట్లలో ఇక రెండు కూడా క్లీన్ బౌల్డ్ లే ఉన్నాయి అని చెప్పాలి. ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరున్ గ్రీన్ ను మహమ్మద్ షమీ అవుట్ చేసిన విధానం మాత్రం మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా నిలిచింది అనడంలో సందేహం లేదు అని చెప్పాలి. ఒక అద్భుతమైన బంతిని సంధించిన మహమ్మద్ షమీ  ఏకంగా కామరూన్ గ్రీన్ ను బౌల్డ్ చేశాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ సమయంలో 30వ ఓవర్లో మూడో బంతికి ఇది జరిగింది అని చెప్పాలి.

 30వ ఓవర్లో మూడవ బంతిని పుల్లర్ లెన్త్ డెలివరీగా మహమ్మద్ షమీ సంధించాడు. అయితే ఇక మహమ్మద్ షమీ వేసిన బంతికి అటు ఆల్రౌండర్ కామరూన్ గ్రీన్ దగ్గర సమాధానమే లేకుండా పోయింది అని చెప్పాలి. దీంతో ఏం చేయాలో తెలియక తడబడిన కామరూన్ గ్రీన్.  బంతిని డిఫరెంట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. బంతి బ్యాట్ కు మిస్ అయి ఆప్స్ ట్రంప్ ను గిరాటేసింది అని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా వికెట్ ఎగిరి పడింది అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. మహమ్మద్ షమితో పాటు మరో ఫాస్ట్ బౌలర్ సిరాజ్ సైతం మూడు వికెట్లతో సత్తా చాటాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: