వారెవ్వా.. శుభమన్ గిల్.. కోహ్లీని వెనక్కి నెట్టాడుగా?

praveen
గత కొంతకాలం నుంచి భారత క్రికెట్ లో ఒక ఆటగాడు తెగ హాట్ టాపిక్ గా మారిపోతున్నాడు. తన ఆట తీరుతో క్రికెట్ పరీక్షకులందరినీ కూడా తన అభిమానులుగా మార్చుకుంటూ ఉన్నాడు. కేవలం క్రికెట్ ప్రేక్షకులను మాత్రమే కాదండోయ్. ఏకంగా మాజీ ఆటగాళ్లు సైతం అతని ఆట తీరు చూసి ఫిదా అయిపోతూ ఉన్నారు. 23 ఏళ్ల వయసులో అతను ఇంత అనుభవం ఉన్న క్రికెటర్ లాగా ఎలా ఆడగలుగుతున్నాడో తెలియక కన్ఫ్యూషన్ లో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

 అంతర్జాతీయ క్రికెట్ లో అంతంత మాత్రం మాత్రమే అనుభవం ఉన్న ఈ యువ క్రికెటర్ అంత అలవోకగా సెంచరీలు ఎలా చేయగలుగుతున్నాడు అనే విషయంపై కూడా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో చర్చ జరుగుతుంది అని చెప్పాలి. అతను ఎవరో కాదు.. టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్. తన ఆట తీరుతో టీమిండియా భవిష్యత్తు తానే అన్న విషయాన్ని నిరూపిస్తున్నాడు అని చెప్పాలి. పరిమిత ఓవర్ల ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్ అనే తేడా లేకుండా సెంచరీల మోత మోగిస్తున్నాడు శుభమన్ గిల్. దీంతో ప్రపంచ క్రికెట్లో కూడా అతను హాట్ టాపిక్ గా మారిపోయాడు అని చెప్పాలి.

 గత ఏడాది మంచి ప్రదర్శన కనబరిచిన శుభమన్ గిల్.. ఇక ఏడాది ఆరంభం నుంచి తన కెరీర్ లోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తున్నాడు. కాగా 2023లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు అని చెప్పాలి. శుభమన్ గిల్ ఈ ఏడాది 15 ఇన్నింగ్స్ లు ఆడగా.. ఐదు సెంచరీలు ఒక అర్థ సెంచరీ తో 923 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత డేవోన్ కాన్వే 17 ఇన్నింగ్స్ లలో 669 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇందులో మూడు సెంచరీలు నాలుగు అర్థ సెంచరీలు ఉన్నాయి. ఇక విరాట్ కోహ్లీ 12 ఇన్నింగ్స్ లలో 635 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: