టీమిండియా.. ఎవరికి థాంక్స్ చెప్పాల్సిన పనిలేదు : గవాస్కర్

praveen
భారత అభిమానులు అందరూ కూడా ఆశపడినట్లు గానే టీమిండియా జట్టు అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది అని చెప్పాలి. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మూడో మ్యాచ్లో గెలవడంతో ఫైనల్ అడుగుపెట్టిన మొదటి జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టిస్తే.. ఇక అటు టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ అడుగుపెడుతుందా లేదా అనేదానిపై కొంతమంది విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేశారు.

 ఇలాంటి సమయంలోనే అటు శ్రీలంక, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ విజయం సాధించింది. 2 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది అని చెప్పాలి. ఇక శ్రీలంక ఓటమితో ఎలాంటి సమీకరణాలు లేకుండానే అటు టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత నాలుగో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగించుకుని సిరీస్ కూడా కైవసం చేసుకుంది. అయితే కేవలం న్యూజిలాండ్ గెలుపు కారణంగానే అటు టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ లో అడుగుపెట్టింది అంటూ కొంతమంది సోషల్ మీడియాలో న్యూజిలాండ్ కు థాంక్స్ చెబుతున్నారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమ్ ఇండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూజిలాండ్ జట్టుకు భారత్ రుణపడి లేదని.. ఆ జట్టుకు  ఎలాంటి కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టు ఎవరి మీద ఆధారపడి డబ్ల్యూటీసి ఫైనల్లో చేరలేదని.. గత రెండేళ్లుగా అద్భుతమైన ఆట తీరు కనబరిచి ఇక డబ్ల్యూటీసి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది అంటూ సునీల్  గవాస్కర్  చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవల ఆస్ట్రేలియాపై సిరీస్ గెలుచుకున్న టీమిండియా జట్టు అదే ఆస్ట్రేలియా తో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తలబడబోతుంది అని చెప్పాలి. ఇక భారత జట్టు ఈసారి విశ్వవిజేతగా నిలుస్తుందని అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: