బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బెస్ట్ బ్యాటర్.. అన్నిట్లోనూ అతను తోపు?
ఈ క్రమంలోనే ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన మొదటి రెండు మ్యాచ్లు కూడా పెద్దగా ఆకట్టుకునే విధంగా జరగలేదు. కానీ ఇప్పుడు చివరి మ్యాచ్ మాత్రం తీవ్ర ఉత్కంఠ మధ్య జరుగుతుంది అన్నది తెలుస్తుంది. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు ఏకంగా 480 పరుగుల భారీ స్కోరు చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ భారీ స్కోరు ఛేదించేందుకు ఇక ఇప్పుడు టీమిండియా బరిలోకి దిగింది. టీమిండియా ఆటగాళ్లు ఎలా రాణించబోతున్నారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.
అయితే ఆస్ట్రేలియా చేసిన 480 పరుగులలో అటు ఉస్మాన్ ఖవాజా ఒక్కడే 180 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఇక మరోవైపు కామరూన్ గ్రీన్ సైతం సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప్రస్తుతం నాలుగవ టెస్ట్ మ్యాచ్లో అదరగొడుతున్న ఉస్మాన్ ఖవాజా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాదు ఇక ఈ ప్రతిష్టాత్మకమైన సిరీస్ లో ఉత్తమ సగటు.. అత్యంత ఎక్కువ బౌండరీలు.. అత్యధిక 50 ప్లస్ స్కోరు.. జాయింట్ మోస్ట్ హండ్రెడ్స్.. అంతేకాకుండా అత్యధిక వ్యక్తిగత స్కోర్ కలిగిన ఆటగాడిగా కూడా ఉస్మాన్ ఖావాజా రికార్డు సృష్టించాడు అని చెప్పాలి.