
అశ్విన్, జడేజాలకు పెద్ద అభిమానిని : ఆసిస్ బౌలర్
కానీ ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్లో మాత్రం భారత జట్టు కు చుక్కెదురైంది. ఎందుకంటే అద్భుతంగా రాణిస్తుంది అని అనుకున్నప్పటికీ ఇక భారత బౌలింగ్ విభాగం ముందు పూర్తిగా చేతులేత్తేసింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తక్కువ పరుగులకే టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం మొత్తం కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఇలా మూడో టెస్ట్ తోలి ఇన్నింగ్స్ లో భారత జట్టును దెబ్బ కొట్టిన మాథ్యూ కునేమన్ పేరు మారుమోగిపోయింది అని చెప్పాలి. ఏకంగా ఐదు వికెట్లతో టీమ్ ఇండియాను దెబ్బ కొట్టాడు.
అయితే రెండు వారాల క్రితమే ఇతను ఆస్ట్రేలియాలో షఫీల్డ్ షీల్డ్ టోర్నీలో ఆడి.. ఇక ఈ సిరీస్ ద్వారా ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేశాడు. ఇక మూడవ టెస్ట్ మ్యాచ్ అతనికి మొదటి టెస్ట్ మ్యాచ్ మాత్రమే కావడం గమనార్హం. తొలిసారి ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే అతను మీడియాతో మాట్లాడుతూ భారత స్పిన్నర్లు జడేజా అశ్విన్లకు నేను ఒక పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. కొన్నేళ్లుగా వీళ్ళ బౌలింగ్ చూస్తూనే ఉన్నాను. రెండో టెస్టులో జడేజా బౌలింగ్ను ఎంతో క్షుణ్ణంగా పరిశీలించాను. ఇక మూడో టెస్టులో కూడా నేను జడేజా లాగానే బంతులు వేయడానికి ప్రయత్నించాను. ఢిల్లీతో పోలిస్తే ఇండోర్ పిచ్ భిన్నంగా స్పందిస్తుంది. ప్రతిరోజు ఇలా వికెట్లు సాధించలేం కాబట్టి వచ్చినప్పుడే ఆస్వాదించాలి అంటూ మాథ్యూ కునేమన్ చెప్పుకొచ్చాడు.