అలాంటి షాట్స్.. ఆస్ట్రేలియా కొంపముంచాయి : వెంగ్ సర్కార్

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా భారత్ జట్ల మధ్య ఎంతో ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇందులో భాగంగానే ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అయితే పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనలో ఇక ఆతిధ్య భారత జట్టుకు గట్టి పోటీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు పూర్తిగా చేతులెత్తేస్తూ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా భారత స్పిన్ బౌలింగ్ దాటికి ఎక్కడ అంచనాలను అందుకోలేక పోతుంది. ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్ లలో కూడా విఫలమైంది అని చెప్పాలి.

 భారత్లో ఉన్న స్పిన్ పీచ్ లపై అటు భారత బౌలింగ్ విభాగం చేస్తున్న మ్యాజిక్ కి ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్లు పరుగులు రాబట్టడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. ఇక ఇలా పరుగులు రాబట్టేందుకు ఎంత ప్రయత్నించినప్పటికీ కుదరకపోవడంతో చివరికి ఒత్తిడికి గురవుతున్నారు. దీంతో ఏదో ఒక తప్పిదం చేసి ఇక వికెట్ కోల్పోయి పెవీలియన్ చేరడం లాంటివి చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే రెండు మ్యాచ్లలో నాలుగు ఇన్నింగ్స్ లలో కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు నమోదు చేసిన స్కోర్లను చూస్తే ఇక భారత బౌలింగ్ విభాగం ఆస్ట్రేలియాని ఎంత ఇబ్బంది పెడుతుందో అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

 ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందిస్తూ తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే భారత మాజీ కెప్టెన్ వెంగ్ సర్కార్ సైతం ఆస్ట్రేలియా వరుసగా రెండు మ్యాచ్లలో  ఓటమి చవిచూడటంపై కీలక వ్యాఖ్యలు చేశాడు.  భారత పిచ్ లపై ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ ఇబ్బందులు పడుతున్నారని.. స్పిన్ ఆడే నైపుణ్యం ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లలో కొరవడింది అంటూ చెప్పుకొచ్చాడు. స్వీప్ షాట్ ఆడాలనే ప్రయత్నం బాగున్నప్పటికీ  బాల్ మిస్ అయితే మూల్యం చెల్లించుకోక తప్పదని.. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు అందరూ కూడా స్వీప్ షాట్ ఆడి వికెట్లు కోల్పోయారు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: