సహనం కోల్పోయిన రోహిత్ శర్మ.. అంపైర్ పై ఆగ్రహం?
అయితే ఇలా ఎంతో కామ్ అండ్ కూల్ గా ఉండే రోహిత్ శర్మ సైతం అప్పుడప్పుడు మ్యాచ్ జరుగుతుండగా ఏదైనా తప్పు జరిగితే ఆగ్రహంతో ఊగిపోవడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇటీవల రెండవ టెస్టులో కూడా ఇలాంటిదే జరిగింది. తొలి ఇన్నింగ్స్ లో తొలి తో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను 263 పరుగులకే భారత బౌలర్లు ఆల్ అవుట్ చేసేసారు. షమీ నాలుగు వికెట్లు పడగొడితే అశ్విన్, జడేజా చెరువు మూడు వికెట్లు సాధించారు. అయితే ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ మరోసారి తన ప్రశాంతతను కోల్పోయాడు.
ఫీల్డ్ ఎంపైర్ తీసుకున్న నిర్ణయం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు అని చెప్పాలి. ఫీల్డ్ ఎంపైర్ మైకేల్ గోప్ తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో స్పందించాడు. తొలి రోజులో ఆట ఆఖరి ఓవర్ లో లియోన్ వేసిన బౌలింగ్లో రోహిత్ శర్మ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బంతి ప్యాడ్ కు తాకి ఫార్వర్డ్ షార్ట్ లెగ్ ఫీల్డర్ చేతుల్లోకి వెళ్ళింది. దీంతో ఇక ఆస్ట్రేలియా ఫీల్డర్లు అందరూ కూడా గట్టిగా అప్ఫీల్ చేశాడు. అయితే ఫీల్డ్ ఎంపైర్ గా ఉన్న మైకేల్ గోప్ సైతం ఇక దానిని అవుట్ గా ప్రకటించాడు. దీంతో రోహిత్ శర్మ ఔట్ ఇచ్చిన అంపైర్ పై అరుస్తూ ఇక బ్యాట్ ను గట్టిగా బాదుతూ రివ్యూ తీసుకున్నాడు. రివ్యూలో బంతి ప్యాడ్ ను తగిలినట్లుగా తేలడంతో ఫీల్డ్ ఎంపైర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని నాటౌట్ గా ప్రకటించాడు.