షాకింగ్ : బుమ్రా ఇక టీమిండియాలో లేనట్టే?

praveen
టీమ్ ఇండియాలో కీలక బౌలర్గా కొనసాగుతూ ఉన్నాడు బుమ్రా. ఇక అతను అద్భుతమైన ఆట తీరుతో టీమ్ ఇండియాకు విజయాలు అందించిన సందర్భాలు చాలానే ఉన్నాయి అని చెప్పాలి. బుల్లెట్ లాంటి బంతులను విసిరూతు ఎప్పుడూ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉంటాడు ఈ స్టార్ బౌలర్   అలాంటి బమ్రాను భారత జట్టులో చూసి దాదాపు నెలలు గడిచిపోతుంది అన్న విషయం తెలిసిందే. కారణం వెన్ననొప్పి గాయం కారణంగా అతను భారత జట్టుకు దూరంగానే ఉంటున్నాడు. అయితే సర్జరీ చేసుకొని కోలుకున్నప్పటికీ పూర్తిస్థాయి ఫిట్నెస్ సాధించకపోవడంతో ఇక తుది జట్టులో తీసుకునే సాహసం చేయడం లేదు సెలెక్టర్లు.


 ఈ క్రమంలోనే కీలక బౌలర్ అయిన బుమ్రా లేకుండానే అటు టీమిండియా అన్ని మ్యాచ్లు కూడా ఆడేస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఆసియా కప్ టి20 వరల్డ్ కప్ లాంటి కీలకమైన టోర్నీలకు దూరమైన బుమ్రా ఇక ఆస్ట్రేలియా తో స్వదేశంలో జరగబోయే టెస్ట్ సిరీస్ కి మాత్రం అందుబాటులోకి వస్తాడని అందరూ భావించారు. అయితే ఇప్పటికే టీమ్ ఇండియా రెండు టెస్టులకు సంబంధించి జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఇంకా రెండు టెస్టులకు ప్రకటించాల్సి ఉంది.


 అయితే మిగిలి ఉన్న రెండు టెస్టులకు సంబంధించిన జట్టు ప్రకటనలో ఇక బుమ్రా పేరు పరిగణలోకి తీసుకుంటారని అందరూ భావించారు. కానీ ఇక ఆస్ట్రేలియాతో  జరగబోయే టెస్ట్ సిరీస్ మొత్తానికి బుమ్రా దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది. ఇప్పటికే రెండు టెస్టులకు ఎంపిక చేయలేదు. ఇక మిగతా రెండు టెస్టులకు కూడా అతను దూరం కాబోతున్నాడు అని అటు బీసీసీఐ వర్గాల నుంచి సమాచారం. 2023 ఏడాదిలోనే వన్డే వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇక బుమ్రా విషయంలో తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకని అటు బీసీసీఐ కూడా రిస్క్ చేయడం లేదట. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఉన్నాడు బుమ్రా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: