నా కెరియర్లో.. అదే బెస్ట్ సిరీస్ : పూజారా

praveen
ఫిబ్రవరి 9వ తేదీ నుంచి ఆస్ట్రేలియా ఇండియా టెస్ట్ సిరీస్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ ఇరు జట్లకు కూడా ఎంతో కీలకం. ముఖ్యంగా భారత జట్టుకు అయితే చావో రేవో తేల్చుకోవాల్సిన సిరీస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలంటే భారత జట్టు తప్పనిసరిగా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియాను ఓడించాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతుంది టీమిండియా.

 ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతూ ఉండగా ఇక ఇప్పటికే ఫైనల్ లో అడుగు పెట్టింది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఇక ఆస్ట్రేలియా తో టెస్టు సిరీస్ లో భారత జట్టు ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇక అందరూ కూడా ఇదే విషయంపై చర్చిస్తూ ఉన్నారు. ఎంతో మంది మాజీ ఆటగాళ్ళు ఎవరి ప్రదర్శన ఎలా ఉంటుంది అనే దానిపై తమ అభిప్రాయాలను రివ్యూల రూపంలో సోషల్ మీడియాలో చెప్పేస్తూ ఉన్నారు అని చెప్పాలి.  ఇదే విషయంపై మాట్లాడాడు భారత టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్  పూజార.

 ఫిబ్రవరి 9 నుంచి భారత్ ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇరు జట్ల మధ్య రసవత్తరమైన పోరు ఉంటుంది అంటూ పూజార చెప్పుకొచ్చాడు. అయితే తన కెరియర్ లో 2018- 19 బోర్డర్ గవాస్కర్ సిరీస్ ఎంతో అత్యుత్తమమైనది అంటూ తెలిపాడు.  ఇక ఈ సిరీస్ లో ప్రతి మ్యాచ్ కూడా ఒక సవాలుగా ఉండేది అంటూ గుర్తు చేసుకున్నాడు చటిశ్వర్పూజారా. అయితే అప్పుడు జరిగిన ఆ టెస్టు సిరీస్ లో అద్భుతమైన బ్యాటింగ్ చేసిన పూజార 521 పరుగులు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత జట్టు 2-1 తేడాతో సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ విషయంలో పూజార కీలకపాత్ర వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: