వావ్.. యూసుఫ్ పఠాన్ కెప్టెన్ అయ్యాడోచ్?

praveen
ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దేశవాళి క్రికెట్ లీగ్ లదే హావా నడుస్తుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది మాజీ ప్లేయర్లు సైతం ఇలా ఫ్రాంచైజీ క్రికెట్లో భాగం అయ్యి మరోసారి క్రికెట్ తో ప్రేక్షకులను అలరించాలని భావిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో కూడా ఎంతమంది ప్లేయర్లు భాగం అయ్యి అదరగొడుతున్నారు అని చెప్పాలి. అయితే అక్కడ కూడా ఇక ఐపీఎల్ లో ఉన్న ఫ్రాంచైజీలే జట్లను కొనుగోలు చేశాయి.

 ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు యాజమాన్యం ఇక ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో దుబాయ్ కాపిటల్స్ ని కొనుగోలు చేసింది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ టోర్నీ ఎంతో రసవత్తారంగా సాగుతుంది. ఇలాంటి సమయంలో దుబాయ్ క్యాపిటల్ జట్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఏకంగా తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు నుంచి వెస్టిండీస్ స్టార్ ప్లేయర్ అయిన రోవ్ మన్ పావెల్ ను తప్పించింది. ఇక అతని స్థానంలో టీమిండియా మాజీ ఆటగాడు యూసఫ్ పఠాన్ జట్టు కొత్త కెప్టెన్ గా నియమించింది దుబాయ్ క్యాపిటల్స్ జట్టు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి.

 ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో భాగంగా దుబాయ్ కాపిటల్స్ ఆడబోయే మిగిలిన మ్యాచులు అన్నింటికీ కూడా జట్టు కెప్టెన్ గా యూసఫ్ పఠాన్ కు బాధ్యతులు బాధితలు నిర్వహిస్తాడు అన్న విషయాన్ని చెప్పుకోచ్చాడు. కాగా దుబాయ్ కాపిటల్స్ జట్టు ప్రస్తుతం పాయింట్లు పట్టికలో అయిదవ స్థానంలో కొనసాగుతుంది అని చెప్పాలి.  గత కొంతకాలం నుంచి వరుసగా పరాజయాలతో సతమతమవుతుంది. ఈ నేపద్యంలో దుబాయ్ క్యాపిటల్స్ జట్టు ఇలాంటి నిర్ణయం తీసుకుంది అన్నది తెలుస్తుంది. అయితే రోమన్ పావెల్ అటు వ్యక్తిగతంగా అద్భుతమైన ప్రదర్శన చేసినప్పటికీ ఎందుకు అతన్ని కెప్టెన్సీ పగ్గాల నుంచి పక్కకు పెట్టిందో అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: