ఇషాన్ కిషన్ దానిపై దృష్టి పెడితే బెటర్ : జాఫర్
అయితే 2023 ఏడాదిలో మాత్రం ఇషాన్ కిషన్ వరుసగా అవకాశాలు దక్కించుకుంటున్నాడు అని చెప్పాలి. ఇకపోతే అటు వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసి అదరగొట్టిన ఇషాన్ కిషన్ టి20 ఫార్మాట్లో మాత్రం పూర్తిగా తేలిపోతూ ఉన్నాడు. టీ20 ఫార్మాట్లో అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూ ఉన్నప్పటికీ సరైన ప్రదర్శన చేయలేక నిరాశ పరుస్తూనే ఉన్నాడు అని చెప్పాలి. సింగిల్ డిజిట్ స్కోర్కె పెవిలియన్ చేరుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే వన్డేల్లో అదరగొట్టిన ఇషాన్ కిషన్కు ఇక టి20 లు కలిసి రావట్లేదే అని కొంతమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఇకపోతే ఇదే విషయం పై టీం ఇండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ కూడా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. వైట్ బాల్ క్రికెట్లో ఇషాన్ కిషన్ ఇంకా ఎక్కువగా నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది అంటూ వసీం జాఫర్ అభిప్రాయపడ్డాడు. శ్రీలంక న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లలో ఇషాన్ కిషన్ తీవ్రం గా నిరాశ పరిచాడు అంటూ చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇషాన్ కిషన్ ఇబ్బంది పడుతున్నాడని.. ఆ అంశంపై ఇంకా దృష్టి పెట్టాలి అంటూ సూచించాడు. ఇక సమిష్టిగా అందరూ ఆటగాళ్లు బాగా రానించి జట్టుకు విజయాన్ని అందించారు అంటూ తెలిపాడు.