గిల్ సెంచరీ.. కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టాడుగా?

praveen
టీమిండియా నయా సంచలనం శుభమన్ గిల్ గత కొంతకాలం నుంచి తన బ్యాటింగ్ విధ్వంసంతో ఎంతలా అదరగొడుతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓపెనర్గా బరిలోకి దిగుతూ భారీ స్కోర్లు చేస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు శుభమన్ గిల్. ఫార్మాట్ తో సంబంధం లేకుండా తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. తనకు బౌలింగ్ చేసేది ఎంత కఠినమైన బౌలర్ అయినా సరే లెక్క చేయకుండా సిక్సార్లు, ఫోర్లతో చెలరేగిపోతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే మొన్నటికి మొన్న వన్ డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ చేసిన శుభమన్ గిల్..  ఇక ఆ తర్వాత మరో సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇక అంతకుముందు టెస్ట్ ఫార్మాట్లో సెంచరీ చేసేసాడు.  ఇక ఇటీవల టి20 ఫార్మాట్లో బాకీ ఉన్న సెంచరీలు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే టీమ్ ఇండియా తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన కొంతమంది ఆటగాళ్ల లిస్టులోకి శుభమన్ గిల్ పేరు కూడా చేరిపోయింది. అది కూడా 23 ఏళ్ల వయసులోనే ఇలాంటి అరుదైన రికార్డును సాధించడం గమనార్హం. ఇటీవలే అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో ఇలా సెంచరీ తో చెలరేగిపోయాడు. ఏకంగా 63 బంతుల్లోన 126 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు అని చెప్పాలి. ఇక తన కెరియర్లో తొలి టీ20 శతకాన్ని కూడా సాధించి ఎన్నో ప్రపంచ రికార్డులను సాధించాడు.

 అయితే భారత క్రికెట్లో విరాట్ కోహ్లీ రికార్డుల కింగుగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నో ప్రపంచ రికార్డులు కొల్లగొట్టి తన పేరును మారుమోగిపోయేలా చేసుకున్నాడు. అయితే అలాంటి రికార్డుల కింగ్ విరాట్ కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టాడు శుభమన్ గిల్. టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కాగా కోహ్లీ చేసిన (122 నాట్ అవుట్ )ఇక ఇప్పటి వరకు అత్యధిక పరుగులుగా ఉండగా.. ఇటీవల శుభమన్ గిల్ ఏకంగా 126 పరుగులు చేసి టి20 లో భారత జట్టు తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా అరుదైన అధికారులు తన పేరు లీకించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: