సూర్య కుమార్ అభిమానులకు.. గుడ్ న్యూస్ చెప్పిన సెలెక్టర్?

praveen
గత కొంతకాలం నుంచి పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నాడు సూర్య కుమార్ యాదవ్. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్గా పిలుచుకునే టీ20 ఫార్మాట్లో అయితే అతని బ్యాటింగ్ విధ్వంసం ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత రెండేళ్ల నుంచి కూడా తిరుగులేని బ్యాటింగ్తో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాడు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కసారి మైదానంలోకి వచ్చాడు అంటే చాలు ఇక ప్రత్యర్థి జట్టు ఏదైనా.. తనకు బౌలింగ్ చేస్తుంది ఎంతటి స్టార్ బౌలర్ అయిన సరే ఎక్కడ ఒత్తిడికి గురికాకుండా అలవోకగా షాట్లు ఆడుతూ ఉంటాడు.

 మైదాన నలువైపులా ఎంతో అలవోకగా అదిరిపోయే సిక్సర్లు కొట్టే సూర్య కుమార్ యాదవ్ ఎప్పుడు తన ప్రదర్శనతో ఆశ్చర్యపరుస్తూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే తన ఆట తీరుతో ఏకంగా టి20 రాంగింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని చేరుకున్నాడు. అయితే ఇప్పటివరకు అటుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో మాత్రం సూర్యకుమార్ అరంగేట్రం చేయలేదు. అయితే   ఫిబ్రవరిలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లో మాత్రం సూర్యకుమార్ సుదీర్ఘమైన ఫార్మాట్లోకి రాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.

 అయితే ఇక టెస్ట్ జట్టు కోసం సూర్యకుమార్ ని ఎంపిక చేసినప్పటికీ అతనికి తుది జట్టులో చోటు ఉంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఆస్ట్రేలియా తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఇక సూర్యకుమార్ టెస్ట్ ఎంట్రీ ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్నారు.  దీంతో సూర్యకు లైన్ క్లియర్ అయినట్లే అని తెలుస్తుంది. ఇక ఈ విషయంపై బీసీసీఐ సెలక్టర్ శ్రీధరన్ శరత్ కూడా హింటిచ్చాడు. బౌలర్లపై ఆటాక్ చేస్తూ ప్రత్యర్థి చేతనుంచి మ్యాచ్ను లాగేసుకునే సత్తా సూర్యకు ఉందని.. తుది జట్టులో అతనికి చోటు దక్కొచ్చు అంటూ చెప్పుకొచ్చాడు బిసిసిఐ సెలెక్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: