భారత్ తో టెస్ట్ సిరీస్.. ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ?

frame భారత్ తో టెస్ట్ సిరీస్.. ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ?

praveen
గత కొంతకాలం నుంచి వరుసగా సిరీస్ లు గెలుస్తూ ఆస్ట్రేలియా జట్టు మంచి జోరు మీద ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఇటీవల కాలంలో వరుసగా టెస్ట్ సిరీస్లలో విజయం సాధిస్తూ దూసుకొచ్చిన ఆస్ట్రేలియా జట్టు ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టిన మొదటి జట్టుగా రికార్డు సృష్టించింది అని చెప్పాలి. అయితే మరి కొన్ని రోజుల్లో ఆస్ట్రేలియా జట్టు ఇక భారత పర్యటనకు రాబోతుంది. ఫిబ్రవరిలో ఇక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా పర్యటనకు వచ్చి ఇక్కడ ఆతిథ్య టీమిండియాతో నాలుగు టెస్టుల సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.



 ఆస్ట్రేలియా భారత్ మధ్య జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరి 9వ తేదీన జరగనుండగా.. నాగపూర్ ఇక ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇవ్వబోతుంది అని చెప్పాలి. అయితే భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు ముందు అటు ఆస్ట్రేలియా కు భారీ షాక్ తప్పేలా  లేదు. ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఆస్ట్రేలియా జట్టును గాయాలబెడద తీవ్రంగా వేధిస్తుంది. ఇప్పటికే జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న స్టార్ పెసర్ మిచెల్ స్టార్క్ గాయం బారిన పడ్డాడు. దీంతో అతను తొలి టెస్ట్ ఆడటం అనుమానంగానే కనిపిస్తుంది. దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండవ టెస్టులో ఫీల్డింగ్  చేస్తున్న సమయంలో అతని చేతి వేలికి తీవ్రంగా గాయమైంది..


 దీంతో అతను మూడవ టెస్ట్ కి దూరం అయ్యాడు అని చెప్పాలి. ఇక ఇప్పటికీ కూడా అతను కోలుకోలేదట. ఇక అతను కోలుకోవడానికి దాదాపు 5 వారాల సమయం పడుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల నుంచి సమాచారం. ఒకవేళ ఇదే నిజం అయితే మాత్రం నాగపూర్ వేదికగా జరగబోయే తొలి టెస్ట్ మ్యాచ్ కి అతను అందుబాటులో ఉండడం అనుమానంగానే కనిపిస్తుంది. అతనితోపాటు యువ ఆల్ రౌండర్ కామెరున్ గ్రీన్ కూడా గాయం బారిన పడ్డాడు. అతను కూడా తొలి టెస్ట్ కు అందుబాటులో ఉండడం కష్టమేనట. ఇలా కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమవుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: