ఉచిత సలహాలొద్దు.. నాకో క్లారిటీ ఉంది : బాబర్

praveen
గతకొంతకాలం నుంచి పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాంపై ఏ రేంజ్ లో విమర్శలు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే పాకిస్తాన్ జట్టు వారి సొంత దేశంలో ఎంతో పటిష్టమైన జట్టుగా కనిపించేది. ఏకంగా ప్రత్యర్ధులు సైతం పాకిస్తాన్ ను వారి సొంత దేశంలో ఓడించడం చాలా కష్టమంటూ భావించేవారు. కానీ ఇటీవలే కాలంలో మాత్రం పాకిస్తాన్ పర్యటనకు వెళ్తున్న విదేశీ జట్లు పాక్ జట్టుకు వారి సొంత దేశంలోనే వరుసగా షాకిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఇంగ్లాండ్ జట్టు మూడు టెస్ట్ మ్యాచ్లు సిరీస్ ను ఆడింది. ఇక మూడు మ్యాచ్లలో కూడా విజయం సాధించి పాకిస్తాన్ ను క్లీన్ స్వీప్ చేసింది.

 ఇక ఇటీవల న్యూజిలాండ్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆతిథ్య జట్టుతో టెస్ట్ సిరీస్ లో భాగంగా హోరాహోరీగా పోరాడింది. అయితే ఇక న్యూజిలాండ్ దాటికి అటు పాకిస్తాన్ ఒక్క మ్యాచ్లో కూడా విజయం సాధించలేక పోయింది. అతి కష్టం మీద ఇక రెండు మ్యాచ్లను కూడా డ్రాగానే ముగించింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక పాక్ ప్రదర్శన కారణంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ రైస్ నుంచి నిష్క్రమించే పరిస్థితిని కొని తెచ్చుకుంది. ఈ క్రమంలోనే బాబర్ ని కెప్టెన్సీ నుంచి తప్పించాలంటు విమర్శలు వస్తున్నాయి.

 ఇకపోతే గత కొంతకాలం నుంచి తనపై వస్తున్న విమర్శలపై బాబర్ అజాం ఇటీవల స్పందించాడు. కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ డిమాండ్స్ ని తోసిపు చ్చాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. విలేకరులతో మాట్లాడాడు. తను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. టెస్ట్ అయిపోయి ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. ఇక వన్డే సిరీస్ కు సంబంధించిన ప్రశ్నలు ఏవైనా ఉంటేనే అడగండి. కెప్టెన్సీ పై నాకు క్లారిటీ ఉంది. ఉచిత సలహాలు వద్దు.. ఇక జట్టు విజయం కోసంమెరుగైన ప్రదర్శన ఇవ్వడం పైనే నా దృష్టంతా ఉంది అంటూ బాబర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: