కేన్ మామ.. నిన్ను చాలా మిస్ అవుతాం?
అయితే అలాంటి కేన్ విలియమ్సన్ సేవలను ఇక హైదరాబాద్ పొందలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే రిటెన్షన్ ప్రక్రియలో భాగంగా ఇక జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న స్టార్ ప్లేయర్ విలియమ్సన్ ను వేలంలోకి వదిలేస్తూ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇక సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నిర్ణయంతో అందరూ షాక్ అయ్యారు అని చెప్పాలి. అయితే మళ్లీ మినీ వేలంలో అతని సన్రైజర్స్ దక్కించుకుంటుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఇటీవల మినీ వేలంలో చివరికి కేన్ విలియమ్సన్ ను మరో ఫ్రాంచైజీ దక్కించుకుంది.
రెండు కోట్ల బేస్ ప్రైస్ తో మినీ వేలంలో పాల్గొన్న కేన్ విలియమ్సన్ గత ఏడాది ఛాంపియన్గా నిలిచి డిజైనింగ్ ఛాంపియన్గా మారిపోయిన గుజరాత్ టైటన్స్ కొనుగోలు చేసింది అని చెప్పాలి. దీంతో ఇక మళ్ళీ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కేన్ విలియంసన్ కనిపించడం కష్టతరమే అని చెప్పాలి. దీంతో ఇక సన్రైజర్స్ జట్టు కోసం ఎంతో చేసిన కేన్ విలియమ్సన్ ను తప్పకుండా మిస్ అవుతామని ఎంతోమంది తెలుగు క్రికెట్ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే మయాంక్ అగర్వాల్ సన్రైజర్స్ కొనుగోలు చేయగా అతనికి కెప్టెన్సీ అప్పగించే అవకాశాలు ఉన్నాయి.