వైరల్ : పంత్.. కోహ్లీ ఫ్యాన్స్ గర్వపడేలా చేశావ్?
అదే సమయంలో ఇక ఎంతోమంది ప్లేయర్లు మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏకంగా క్యాచ్ లు పట్టేందుకు ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలాంటి క్యాచ్లు ఏవైనా మ్యాచ్లో జరిగాయి అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంది. ఇక ఇప్పుడు టీమిండియా బంగ్లాదేశ్ మధ్య మొదటి టెస్ట్ లో భాగంగా ఇలాంటి ఘటనే జరిగింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత చురుకుగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసాధ్యం అనుకున్న క్యాచ్ లను కూడా ఓడిసిపడుతూ ఉంటాడు.
అందుకే విరాట్ కోహ్లీ ఎప్పుడైనా క్యాచ్ మిస్ చేసాడు అంటే చాలు ఇక అభిమానులు సైతం షాక్ అవుతూ ఉంటారు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్లో భాగంగా విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ చేయగా పక్కనే ఉన్న రిషబ్ పంత్ అద్భుతంగా ఆ బంతిని అందుకున్నాడు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారిపోయింది. 47 ఓవర్లో బ్యాట్స్మెన్ నజ్ముల్ హుస్సేన్ స్లిప్ లో ఉన్న విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. అయితే అనూహ్యంగా బంతి కోహ్లీ చేతుల నుంచి జారిపోయింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రిషబ్ పంత్ క్యాచ్ ని పట్టుకున్నాడు. ఇది చూసిన ఫాన్స్ కోఆర్డినేషన్ అంటే ఇలా ఉండాలి అంటూ కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ ఫ్యాన్స్ గర్వపడేలా చేసావ్ అంటూ కొంతమంది రిషబ్ పంత్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.