కోహ్లీ తర్వాత.. అతనే స్టార్ బ్యాట్స్మెన్ అవుతాడు : జాఫర్
టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర్ పూజార సెంచరీ చేయడం కొత్తేమీ కాకపోయినప్పటికీ.. దాదాపు 1443 రోజుల నిరీక్షణ తర్వాత సెంచరీ సాధించాడు. ఇక మరోవైపు యువ ఆటగాడు శుభమన్ గిల్ కేరియర్ లో మొదటి టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. 152 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన బ్యాటింగ్ పై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే శుభమన్ గిల్ బ్యాటింగ్ ప్రతిభ పై స్పందించిన భారత మాజీ ఆటగాడు వసీం జాఫర్ పొగడ్తలతో ఆకాశానికెత్తేసాడు . విరాట్ కోహ్లీ తర్వాత భారత్ తరఫున శుభమన్ గిల్ బిగ్ బ్యాట్స్మెన్ గా మారతాడంటూ అంచనా వేశాడు.
ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ వర్తమాన బాట్స్మన్ లలో శుభమన్ గిల్ ఒకరు మూడు ఫార్మాట్లలో దేనిలో అయిన భారత జట్టుకు రెగ్యులర్ గా మారడానికి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. తొలి టెస్ట్ మ్యాచ్లో సెంచరీ సాధించడం ద్వారా ఆల్ ఫార్మాట్ ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించాడు. రానున్న కాలంలో అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. విరాట్ కోహ్లీని గొప్ప ఆటగాడికి అందరూ భావిస్తారు. ఇక ఇప్పుడు కోహ్లీ తర్వాత శుభమన్ గిల్ ఈ ఘనత సాధించడం ఖాయం అంటూ వసీం జాఫర్ చెప్పుకొచ్చాడు.