డబుల్ సెంచరీ ఈజీ.. కానీ అది చాలా కష్టం?

praveen
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న టీమిండియా అక్కడ వరుసగా సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే బంగ్లాదేశ్ జట్టుతో వన్డే సిరీస్ ముగించుకుంది టీమ్ ఇండియా జట్టు. ఇక వన్డే సిరీస్ లో భాగంగా మొదటి రెండు మ్యాచ్లలో పేలువ ప్రదర్శనతో నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా రెండు మ్యాచ్లలో ఓడిపోయిన టీమ్ ఇండియా జట్టు ఇక మూడో మ్యాచ్లో వన్డే సిరీస్ లో భాగంగా ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే కనీసం మూడో వన్డే మ్యాచ్లో అయినా టీమిండియా గెలిచి పరువు నిలబెట్టుకుంటుందో లేదా అనే ఆందోళన టీమ్ ఇండియా అభిమానుల్లో మొదలైంది.

 ఈ క్రమంలోనే నామమాత్రమైన మూడో వన్డే మ్యాచ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా జట్టు అదరగొట్టింది అని చెప్పాలి. అభిమానులు అందరిలో కూడా సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మూడో వన్డే మ్యాచ్లో భారీగా పరుపులు తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ఒకవైపు ఇషాన్ డబుల్ సెంచరీ చేసాడు. 126 బంతుల్లోనే 200 స్కోర్ ని అందుకున్నాడు ఇషాన్ కిషన్. మరోవైపు నుండి టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం 85 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు అని చెప్పాలి.

 ఇక తద్వారా విరాట్ కోహ్లీ తన కెరియర్ లో 72 సెంచరీల మార్పును అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీల పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేసి ఎక్కువ సెంచరీలు చేసిన ఆటగాడిగా రెండవ స్థానానికి చేరుకున్నారు. కోహ్లీ ఇన్నింగ్స్ పై అజయ్ జడేజా స్పందిస్తూ  ప్రశంసలు కురిపించాడు. ఒకరోజులో డబుల్ సెంచరీ లేదా ట్రిపుల్ సెంచరీ చేయవచ్చు. కానీ 72 సెంచరీలు చేయడం అంటే అద్భుతం. ఇలాంటి మైలురాయిని ఒక రోజుల్లో సాధించడం అసాధ్యం. నిలకడకు మారుపేరు విరాట్ కోహ్లీ అంటూ అజయ్ జడేజా ప్రశంసలతో ఆకాశానికేత్తెసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: