వావ్.. అద్భుత సెంచరీ.. అతన్ని వెనక్కిన కోహ్లీ?
నేటి జనరేషన్ క్రికెటర్లతో పోల్చి చూస్తే విరాట్ కోహ్లీ సాధించిన రికార్డులకు ఏ క్రికెటర్ కూడా చేరువలో లేడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఎన్ని రికార్డులు సాధించిన ఇంకా కొత్తగా క్రికెట్లోకి అరంగటం చేసిన ఆటగాడు లాగానే ఇక ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేయాలనే కసి విరాట్ కోహ్లీలో కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే ఆసియా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసి మూడేళ్ల నిరీక్షణకు తెరదించిన విరాట్ కోహ్లీ.. ఇక బంగ్లాదేశ్ తో జరిగిన జరిగే మూడో వన్డే మ్యాచ్‌లో కూడా సెంచరీ తో చెలరేగిపోయాడు. 85 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు విరాట్ కోహ్లీ.
అయితే విరాట్ కోహ్లీకి వన్డే ఫార్మాట్లో ఇది 44వ సెంచరీ కావడం గమనార్హం. అంతేకాదు ఇక కెరియర్ మొత్తంలో మూడు ఫార్మట్ లలో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 72 సెంచరీలు చేశాడు. ఇక ఇలా వన్డే ఫార్మాట్లో ఇటీవల సాధించిన సెంచరీ ద్వారా ఇక అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండవ స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 71 సెంచరీల రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ. కోహ్లీ ప్రస్తుతం రెండవ స్థానంలో ఉండగా ఈ లిస్టులో అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్ కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 51 వన్ డేలలో 49 సెంచరీలు చేసి మొత్తంగా తన కెరియర్లో 100 సెంచరీలు సాధించాడు సచిన్. మరి కోహ్లీ సచిన్ రికార్డును బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి.