వరల్డ్ నెంబర్.1 బ్యాట్స్మెన్.. మరో సెంచరీ?

praveen
గత కొంతకాలం నుంచి అద్భుతమైన ప్రదర్శన చేస్తూ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ మార్నర్స్ లబూషేణ్. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్కచేయకుండా తన బ్యాట్ జులిపిస్తూ అదరగొడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఏకంగా జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తూ దూసుకుపోతున్నాడు. ఇలా గత కొంతకాలం నుంచి కెరియర్ లోనే అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న మార్నస్ లబుషేన్ ఐసిసి విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు అన్న విషయం తెలిసిందే.


 దీంతో మార్నస్ లబుషేన్ అభిమానులు అందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా అతను తన బ్యాటింగ్ తో ఇలాంటి విధ్వంశాన్ని కొనసాగించాలి అని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు అని చెప్పాలి.. ఇక అతడు వరుసగా మ్యాచ్ లలో విరోచితమైన సెంచరీల సాధిస్తూ ఉండడం పై మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. అతడి ఆట తీరు అమోఘం అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. కాగా ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నా మార్నస్ లబుషేన్ మరో సెంచరీ తో చెలరేగిపోయాడు.


 ప్రస్తుతం ఆస్ట్రేలియా, వెస్ట్ ఇండీస్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల జరిగిన టెస్ట్ మ్యాచ్లో వరల్డ్ నెంబర్వన్ ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేన్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇప్పటికే రెండు సెంచరీలు చేసిన మార్నస్ లబుషేన్ ఇక వరుసగా మూడో సెంచరీ కూడా నమోదు చేశాడు అని చెప్పాలి. ఇక ఈ సెంచరీ ద్వారా ఎన్నో అరుదైన రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు మార్నస్ లబుషేన్. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదిక స్పందిస్తున్న మాజీ ఆటగాళ్లు అతనిపై ప్రశంసల కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: