ఫిఫా వరల్డ్ కప్.. రోనాల్డోకి ఘోర అవమానం?
ఇక ఈ స్టార్ ప్లేయర్ కి అటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో క్రిస్టియన్ రోనాల్డో పోర్చుగల్ జట్టు తరఫున మైదానంలో కనిపించాడు అంటే చాలు అభిమానులు అందరూ కూడా పూనకాలు వచ్చినట్లుగా ఊగిపోతూ ఉంటారు అని చెప్పాలి. ఇక అతను ఆడుతుంటే చూడటానికి ఎంతగానో ఆసక్తి చూపుతు ఉంటారు. కానీ ఇటీవల ఇలాంటి స్టార్ ప్లేయర్ అయినా క్రిస్టియానో రోనాల్డో కి ఊహించని అవమానం ఎదురయింది అని చెప్పాలి. ఇటీవల స్విజర్లాండ్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా క్రిస్టియానో రోనాల్డోని పక్కకు పెడుతూ బెంజ్ స్ట్రెంత్ కే పరిమితం చేయడం అందరిని అవాక్కయ్యేలా చేసింది.
ఇది నిజంగా సిగ్గుచేటు అంటూ ఏకంగా క్రిస్టియానో రోనాల్డో గర్ల్ ఫ్రెండ్ జార్జిన ఆ జట్టు కోచ్ ఫెర్నాండో స్సాంటోస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది అని చెప్పాలి. ఏకంగా స్టార్ ప్లేయర్ అయినా రోనాల్డో ప్లేస్ ను 21 ఏళ్ల రామోస్ తో భర్తీ చేశారు జట్టు నిర్వాహకులు. ఈ క్రమంలోనే దాదాపు 74 నిమిషాల పాటు క్రిస్టియానో రోనాల్డో అటు బెంజ్ స్ట్రెంత్ కే పరిమితం అయ్యాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. దీంతో ఇక అతను ఎప్పుడు మైదానంలోకి వస్తాడా అని అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురుచూశారు చివరికి ఆట ముగిసే సమయంలో 74వ నిమిషంలో మైదానంలోకి వచ్చాడు క్రిస్టియనో రోనాల్డో. దీంతో అప్పటివరకు జట్టుకు సారధిగా వ్యవహరించిన పీప్ క్రిస్టియానో రోనాల్డో కి కెప్టెన్సీ బ్యాచ్ తొడిగాడు అని చెప్పాలి. ఏమైనా ఇది మాత్రం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.