ఫిఫా వరల్డ్ కప్.. చరిత్ర సృష్టించిన మొరాకో?

praveen
ఖతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ప్రస్తుతం ఎన్నో సంచలనాలు నమోదు అవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఎలాంటి అంచనా లేకుండా బలిలోకి దిగిన జట్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాయి అని చెప్పాలి. ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా బలిలోకి దిగిన జట్లను సైతం ఓడిస్తూ పాయింట్లు సాధిస్తూ ఉన్నాయి. ఇలా ఫిఫా వరల్డ్ కప్ లో సంచలన ప్రదర్శనలు, ఫలితాలు అటు ప్రేక్షకులు అందరిని కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 ఈ క్రమంలోనే గ్రూప్ దశలో గత టోర్నీ రన్నరప్ గా ఉన్న క్రెయేషియా ఎంతో పటిష్టమైన బెల్జియం కు షాక్ ఇచ్చింది అనామిక జట్టు అయినా మోరాకో. ఏకంగా ఫుట్బాల్ ప్రేక్షకులందరికీ ఆశ్చర్యపరిచింది. ఇక ఇప్పుడు మరో సంచలనం సృష్టించింది అని చెప్పాలి. మాజీ ఛాంపియన్స్ స్పెయిన్  ను ఓడించి ప్రపంచ కప్ లో తొలిసారి క్వార్టర్ ఫైనల్స్ కు వచ్చి చరిత్ర సృష్టించింది అనామిక మోరకో.  ఇటీవల జరిగిన నాకౌట్ ఫ్రీక్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్లో ఏకంగా స్పెయిన్ ను 3-0 తేడాతో ఓడించి అందరికీ షాక్ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చివరి నిమిషం వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో నిర్మిత 90 నిమిషాలతో పాటు అదనపు 30 నిమిషాలలోను ఇరుజట్లు ఒక్క గోల్ కూడా చేయకుండా 0-0 తో నిలిచాయి.

 ఈ క్రమంలోనే ఇక విజేతను తేల్చేందుకు పెనాల్టీ షూట్ అవుట్ రౌండ్ నిర్వహించారు అనేది చెప్పాలి. ఇందులో మొరాకో మూడు గోల్స్ చేయడం గమనార్ధం. ఇక స్పెయిన్ మాత్రం మూడు ప్రయత్నాల్లోనూ విఫలం కావడంతో చివరికి మొరాకో జట్టు విజయం సాధించింది. ఇక ఇలా షూట్ అవుట్ లో తేలిపోయిన పటిష్టమైన స్పెయిన్ జట్టు 2010 తర్వాత మూడు ఎడిషన్లలో క్వార్టర్ ఫైనల్ చేయడంలో పేలవమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. ఇక మొదటిసారి అటు మొరాకో క్వాటర్ ఫైనల్ చేరి ఇక సరికొత్త చరిత్రకు నాంది పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: