నా వేలు విరగలేదు.. రోహిత్ క్లారిటీ?
కానీ ఊహించని రీతిలో టీమ్ ఇండియా జట్టు ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే చివర్లో జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా చేతివెలికి కుట్లు పడ్డప్పటికి కూడా ఇక బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. కానీ మరోవైపు నుంచి అతనికి సరైన సహకారం లేకపోవడంతో చివరికి టీమిండియా ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. అయితే రోహిత్ శర్మ చేతికి గాయం ఉండడంతో ఇక ఏం జరిగిందో అని అభిమానులు అందరూ కంగారు పడిపోయారు.
బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమి అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ తన బొటనవేలు గాయం గురించి క్లారిటీ ఇచ్చాడు అని చెప్పాలి. తన బొటనవేలు సరిగ్గా లేదు. డీస్ లొకేట్ అయినట్లు స్కానింగ్ లో తేలింది. అయితే కొన్ని కోట్లు కూడా పడ్డాయి. అదృష్టవశాత్తు వేలు విరగలేదు. నేను బ్యాటింగ్ చేసేందుకు రెడీగా ఉన్నాను కాబట్టే మైదానంలోకి వచ్చాను. అయితే వన్డే ఫార్మాట్లో భాగస్వామ్యాలు నెలకొల్పడం ఎంతో ముఖ్యం అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కొత్త బ్యాటర్ వచ్చి ఆడటం అంత సులభమైన విషయం కాదు అంటూ రోహిత్ శర్మ తెలిపాడు. అయితే ఇక రోహిత్ గాయం కారణంగా మూడో వన్డే తో పాటు టెస్ట్ సిరీస్ కి కూడా దూరం కానున్నాడు.