మ్యాచ్ లో మెస్సి ఎందుకు నడుస్తాడు.. సీక్రెట్ చెప్పేసిన మాజీ మేనేజర్?

praveen
ప్రస్తుతం ఫుట్బాల్ ఆటలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతూ వున్నాడు లియోనాల్ మెస్సి. ఏకంగా అర్జెంటీనా టీం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ జట్టుకు విజయాలను అందించడంలో ఎప్పుడు కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు అని చెప్పాలి. అయితే ఇప్పటివరకు అటు ఫుట్బాల్ ఆటలో ఎన్నో రికార్డులను కొల్లగొట్టిన లియోనల్ మెస్సి అటు సొంత జట్టు అయిన అర్జెంటినాకు మాత్రం ఒక్కసారి కూడా వరల్డ్ కప్ అందించలేకపోయాడు అన్న విషయం తెలిసిందే  అతని కెరియర్లో అదొక్కటి మాత్రం అందరిని ద్రాక్ష లాగే మిగిలిపోయింది అని చెప్పాలి.

 అయితే  మెస్సికి ఇదే చివరి వరల్డ్ కప్ అని అందరూ అనుకుంటున్నారు. దీంతో ఈసారి అర్జెంటీనా ఇక వరల్డ్ కప్ గెలవాలని అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవలే లియోనల్ మెస్సి కి సంబంధించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా ఫుట్బాల్ ఆట అంటే మైదానంలో ఎప్పుడు ప్లేయర్స్ పరిగెత్తుతూనే ఉంటారు. కానీ లియోనల్ మెస్సి మిగతా ఆటగాళ్లతో పోల్చి చూస్తే పరిగెత్తడం కాదు నడవడం ఎక్కువగా చేస్తాడట. అది కూడా వేల మీటర్ల వరకు ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచ్లలో నడిచాడు అన్న విషయం ఇటీవల ఒక సర్వేలో వెళ్లడయింది.

ఈ క్రమంలోనే మెస్సి ఎందుకు నడుస్తాడు అన్న విషయంపై చర్చ జరుగుతుండగా మెస్సి మాజీ మేనేజర్ పెప్ గార్దియోలా ఇటీవల ఆసక్తికర సమాధానం చెప్పాడు. మెస్సి నడవడంలోనే పరిగెత్తడం చేస్తూ ఉంటాడు.. అతడు గేమ్ లో ఎంతలో ఇన్వాల్వ్ అవుతున్నాడు అనేదానికి అతని నడికే ఒక ఉదాహరణ. మెస్సి కావాలని అలా నడవడు. మ్యాచ్ ప్రారంభమైన తర్వాత కనీసం 10 నిమిషాల పాటు గ్రౌండ్ మొత్తం నడుస్తూనే ఆటగాళ్ల కదలికలను.. ప్రత్యర్థి  ఆటగాళ్ల వ్యూహాలను కూడా అర్థం చేసుకుంటూ ఉంటాడు. ఇక గ్రౌండ్ పరిసరాలను మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికే మెస్సి ఇలా నడవడం చేస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడూ అతని తల 360 డిగ్రీస్ లో తిప్పుతూ.. ఆటగాల్ల కదలికలను ఎంతో క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అతనిలో ఉన్న ఆటను బయటకు తీయడం చేస్తూ ఉంటాడు. మెస్సి సక్సెస్ కు ఇది ఒక కారణం అందు అతని మాజీ మేనేజర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: