వావ్.. సూపర్.. వరల్డ్ కప్ జట్టులో.. తెలంగాణ అమ్మాయి?

praveen
మరికొన్ని రోజుల్లో దక్షిణాఫ్రికా వేదిక అండర్ 19 మహిళల వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక తొలి అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం అటు మహిళా క్రికెటర్లందరూ కూడా సిద్ధమైపోతున్నారు. ఈ క్రమంలోనే ఇక దక్షిణాఫ్రికా వేదికగా జరగబోయే ఈ వరల్డ్ కప్ లో పాల్గొనబోయే అండర్ 19 మహిళల జట్టు ఏది అన్న విషయాన్ని పూర్తి వివరాలతో ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది అని చెప్పాలి. ఇక అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్ జట్టుకు భారత సీనియర్ జట్టు విధ్వంసకర ఓపెనర్ అయిన షఫాలీ వర్మ నాయకత్వం వహించబోతుంది.

 షఫాలి వర్మ ఏంటి అండర్-19 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం ఏంటి అని అనుకుంటున్నారు కదా. ప్రస్తుతం భారత మహిళల సీనియర్ జట్టులో స్టార్ ప్లేయర్ గా కొనసాగుతున్నప్పటికీ షఫాలీ వర్మకు మాత్రం ఇంకా 19 ఏళ్లు పూర్తి కాలేదు  దీంతో అండర్ 19 వరల్డ్ కప్ ఆడబోయే మహిళల జట్టుకు ఎంపిక అయింది. అదే సమయంలో భారత మహిళల జట్టులో వికెట్ కీపర్ గా కొనసాగుతున్న రీఛా గోష్ కూడా ఇక ఈ జట్టులో భాగం కావడం గమనార్హం  ఇక అదే సమయంలో ఇటీవలే అండర్ 19 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన జట్టులో వైస్ కెప్టెన్గా శ్వేతా శరావత్ వ్యవహరించబోతుంది అన్నది తెలుస్తుంది.

 ఇదిలా ఉంటే ఇలా అండర్ 19  జట్టు ఎంపికలో ఏకంగా తెలుగు క్రికెటర్ చోటు తగ్గించుకోవడం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. తెలంగాణకు చెందిన అమ్మాయి గొంగిడి త్రిష కు అండర్ 19 జట్టులో చోటు దక్కింది. దీంతో ఎంతో మంది తెలుగు క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. అయితే ఈ మెగా ఈవెంట్ వచ్చే ఏడాది జనవరి 14వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: