ఫిఫా వరల్డ్ కప్.. ఆ పని చేస్తూ 500 మంది చనిపోయారట?

praveen
ఇటీవలే ఖతార్ వేదికగా అటు ప్రతిష్టాత్మకమైన ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రపంచ నలుమూలల్లో ఉన్న క్రీడ అభిమానులు అందరూ కూడా ఈ మెగా టోర్నీ కోసం ఎదురు చూస్తూ ఉండగా.. ఇక ఇప్పుడు ఈ టోర్నీ ద్వారా అసలు సిసలైన  ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు అని చెప్పాలి. కొంతమంది ఖతార్ తరలి వెళ్తూ నేరుగా స్టేడియంలో కూర్చొని మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి చూపుతూ ఉంటే.. మరి కొంత మంది ఇక టీవీల ముందు కూర్చొని మ్యాచ్ ను తెగ ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇక మ్యాచ్లు జరగడానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఖతార్ లో ఇక స్టేడియంలో అన్ని రకాల ఏర్పాట్లు చేశారో అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఇక ఖతార్ వేదికగా జరుగుతున్న ఫుట్బాల్ ప్రపంచ కప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతూ ఉన్నాయి. ఫిఫా వరల్డ్ కప్ కోసం ఖతార్ ప్రభుత్వం ఏకంగా అక్కడి స్టేడియాలను ఆధ్యాధునిక హంగులతో తీర్చిదిద్దింది.

 ఇక ఎన్నో మరమ్మత్తులు చేసి సుందరంగా మార్చేసింది అని చెప్పాలి. అయితే ఇక ఇలా మీడియాలను అత్యాధునికంగా తీర్చిదిద్దే సమయంలో ఏం జరిగింది అన్న విషయంపై ఒక అధికారి షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఏకంగా స్టేడియం నిర్మాణంలో సుమారు 400 నుంచి 500 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇది కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే కథార్ ప్రభుత్వం మాత్రం కేవలం 40 మంది మాత్రమే ప్రమాదవశాత్తు చనిపోయారు అంటూ గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదేమైనా ఈ విషయం కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: