ఎందుకు సార్ అతన్ని తొక్కేస్తున్నారు.. ఫ్యాన్స్ ఫైర్?

praveen
ఇటీవల కాలంలో టీమిండియాలో యువ ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఐపీఎల్ సీసన్ లో కూడా కొత్త ఆటగాళ్లు వెలుగులోకి వస్తు తామే ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని తమ ఆట తీరుతో అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సెలక్టర్ల దృష్టిని కూడా ఆకర్షిస్తూ తక్కువ సమయంలోనే భారత జట్టులోకి అరంగేట్రం చేస్తూ ఉన్నారు. ఇక ఇటీవల కాలంలో ఇలా ప్రతిభ ఆటగాళ్ల  సంఖ్య ఎక్కువైన నేపథంలో ఎవరిని  ఎంపిక చేయాలి అన్న విషయంపై ప్రస్తుతం సెలెక్టర్లు కూడా ఎంతో కష్టపడాల్సిన పని ఏర్పడింది అని చెప్పాలి.


 అదే సమయంలో కొంతమంది ఆటగాళ్ల విషయంలో మాత్రం సెలెక్టరులు ఏకంగా వివక్షపూరితమైన ధోరణితో వ్యవహరిస్తున్నారు అన్నది కొంత కొంతకాల నుంచి వెలుగులోకి వస్తున్న మాట. ముఖ్యంగా వికెట్ కీపర్ గా బ్యాట్స్మెన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న సంజు శాంసన్ విషయంలో సెలెక్టరు ఎందుకు చిన్న చూపు చూస్తున్నారు అన్నది అర్థం కావడం లేదని అభిమానులు ఇప్పటికే ఆందోళనలో మునిగిపోతున్నారు. ఎందుకంటే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో మంచి ప్రదర్శన చేశాడు. ఇక టీమ్ ఇండియా తరఫున ఆడిన అడపా దడప మ్యాచ్ లలో కూడా ఆకట్టుకున్నాడు.


 అయినప్పటికీ టీమ్ ఇండియా సెలెక్టర్లు మాత్రం అతనికి తుది జట్టులో అవకాశం కల్పించడం లేదు అని చెప్పాలి. అయితే ఇటీవల న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఛాన్స్ కొట్టేశాడు సంజు శాంసన్. ఛాన్స్ అయితే దక్కించుకున్నాడు కానీ తుది జట్టులోకి మాత్రం రాలేకపోయాడు. కనీసం మూడవ టి20 మ్యాచ్ లో అయినా సంజు శాంసన్  తుది జట్టులో కనిపిస్తాడని అభిమానులు ఎదురుచూసారు. కానీ అభిమానులకు మాత్రం నిరాశే ఎదురైంది అని చెప్పాలి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభిమానులు సంజూ ను ఎందుకు తొక్కేస్తున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: