బాబోయ్.. సెంచరీ వీరుడుని ఒక్క బంతితో బోల్తా కొట్టించాడు?
ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుని సత్తా చాటింది అని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల సిడ్నీ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డే మ్యాచ్లో 72 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది ఆస్ట్రేలియా జట్టు. అయితే ఇలా రెండో వన్డే మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా ఫేసర్ మిచెల్ స్టార్క్ ఏకంగా తన బౌలింగ్ తో నిప్పులు చెరిగాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకరకంగా చెప్పాలి అంటే తన పేస్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ బ్యాటర్స్ కు చుక్కలు చూపించాడు అని చెప్పాలి.
మిచెల్ స్టార్క్ తన తొలి ఓవర్ లోనే రాయ్, మలాన్ లాంటి కీలకమైన బ్యాట్స్మెన్లను అవుట్ చేసి ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ముఖ్యంగా అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతూ మొదటి వన్డే మ్యాచ్లో సెంచరీ తో చెలరేగిపోయిన డేవిడ్ మాలన్ ను మిచెల్ స్టార్క్ అవుట్ చేసిన విధానం మ్యాచ్ మొత్తానికి హైలెట్గా నిలిచింది అని చెప్పాలి. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన స్టార్క్ అద్భుతమైన ఇన్ స్వింగర్ తో డేవిడ్ మాలాన్ క్లీన్ బోల్డ్ చేశాడు. స్టార్క్ వేసిన బంతిని ఆఫ్ సైడ్ ఆడటానికి ప్రయత్నించగా బంతి స్వింగ్ అయ్యి వికెట్లను గిరాటేసింది. దీంతో డేవిడ్ మలాన్ సైతం షాక్ కి గురయ్యాడు అని చెప్పాలి. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.