నాకంటే నువ్వే నయం.. శుభమన్ గిల్ తో ధోని?

praveen
సాధారణంగా భారత జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్న సమయంలో ప్రతి ఆటగాడు కూడా మొదటి మ్యాచ్లోనే మంచి ప్రదర్శన చేసి ఇక అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకోవాలని భావిస్తూ ఉంటాడు. ఇందుకోసం ఏళ్ల తరబడి ఆడిన క్రికెట్ అనుభవం మొత్తం ఇక వెలికి తీయాలని అనుకుంటూ ఉంటాడు అని చెప్పాలి. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం కొంతమంది ఆటగాళ్ళకు నిరాశ ఎదురవుతుంది. పేలవ  ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే యువ ఆటగాడు శుభమన్ గిల్ కు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురయింది. వన్డేలలో అరంగేట్రం మ్యాచ్లోనే తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యాడు శుభమన్ గిల్.


 అయితే తన తొలి మ్యాచ్ లోనే ఇక అలాంటి ప్రదర్శన చేయడంతో అతను ఎంతో బాధలో మునిగిపోయాడట. అయితే అలాంటి సమయంలోనే ఇక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తనను నవ్వించాడు అన్న విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో శుభమన్ గిల్ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టి20 ఫార్మాట్ లో అరంగేట్రం చేసేందుకు సిద్ధమవుతున్నాడు శుభమన్ గిల్. 2019లో న్యూజిలాండ్ వేదికగానే అంతర్జాతీయ వన్డేలలోకి  అరంగేట్రం చేశాడు. ఇక ధోని చేతుల మీదుగా టీమిండియా క్యాప్ అందుకున్నాడు అని చెప్పాలి.


 అయితే తన మొదటి మ్యాచ్ లోనే తొమ్మిది పరుగులు మాత్రమే చేసి అవుట్  అయ్యాడు. ఇక నిరాశతో బాధపడుతున్న సమయంలో ధోని నా దగ్గరికి వచ్చాడు. నేను బాధపడుతున్న విషయాన్ని గ్రహించాడు. అప్పుడు నా వయస్సు 18 నుంచి 19 ఏళ్ళు మాత్రమే. అయితే ధోని నాతో మాట్లాడుతూ.. నాకంటే నీ అరంగేట్రం నయం.. నువ్వు 9 పరుగులైన చేసావ్.. నేనయితే  గోల్డెన్ డక్ అయ్యాను అంటూ చెప్పాడు. దీంతో ధోని భాయ్ అరంగేట్రం మ్యాచ్ లోనే తొలి బంతికే అవుట్ అయిన విషయం నాకు గుర్తొచ్చింది. అయితే ధోని ఇక ఈ విషయాన్ని చెబుతు  నవ్వగా నేను కూడా నవ్వేశాను. ధోని చెప్పిన ఆ మాటలు నా గుండెకు హత్తుకున్నాయి అంటూ శుభమన్ గిల్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: