కోహ్లీ సాధించాడు.. ఇప్పుడు డేవిడ్ వార్నర్ వంతు?
ఇక అలాంటి డేవిడ్ వార్నర్ మళ్ళీ మునుపటి ఫామ్ లోకి రావాలి అంటూ ఎంతోమంది అభిమానులు కోరుతూ ఉన్నారు. అదే సమయంలో ఇక డేవిడ్ వార్నర్ వైఫల్యం పై విమర్శలు చేస్తున్న వారు కూడా లేకపోలేదు. అయితే మొన్నటికీ మొన్న టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇలాంటి తరహా విమర్శలను ఎదుర్కొన్నాడు. కానీ ఆ తర్వాత మాత్రం ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో సెంచరీ చేసి మళ్ళీ మునపడి ఫామ్ అందుకున్నాడు. మొన్నటికి మొన్న వరల్డ్ కప్ లో కూడా కోహ్లీ ఎలాంటి విధ్వంసం సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కాగా విరాట్ కోహ్లీ లాగానే డేవిడ్ వార్నర్ కూడా అటు బ్యాటింగ్లో ఇబ్బంది పడుతూ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తూ ఉండడం గమనార్ధం. ఇక ఒక వెయ్యి 38 రోజులుగా వార్నర్ ఖాతాలో ఒక్క సెంచరీ కూడా నమోదు కాలేదు . అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక వెయ్యి 21 రోజుల తర్వాత సెంచరీ చేశాడని ఇక ఇప్పుడు వార్నర్ వంతు వచ్చిందని ఎంతోమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ ఉండటం గమనార్హం. వార్నర్ త్వరగా మునుపటి బ్యాటింగ్ ఫామ్ అందుకుని మళ్ళీ పరుగుల వరద పారించాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.