వరుణ గండం : ఫైనల్ కోసం రూల్స్ మార్చిన ఐసిసి?

praveen
దాదాపు గత నెల రోజుల నుంచి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచుతున్న వరల్డ్ కప్ ఇక ఇప్పుడు చివరి అంకానికి చేరుకుంది అన్న విషయం తెలిసిందే. నేడే ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఇక ఈ మ్యాచ్ చూసేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం వేయికళ్లతో  ఎదురుచూస్తూ ఉంది. కానీ అందరి ఆశలు అడియాశలుగా మారే అవకాశం కూడా ఉంది అన్నది తెలుస్తుంది. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ మొదలుపెట్టిన నాటి నుంచి కూడా వరుణుడు పగ పట్టినట్లుగానే వ్యవహరిస్తున్నాడు. ఇక వర్షం కారణంగా ఎన్నో కీలకమైన మ్యాచులు రద్దు అయ్యాయి. ఇలా గెలవాల్సిన మ్యాచ్లు కూడా రద్దు కావడంతో కొన్ని జట్లకు ఊహించని పరాభవాలు ఎదురయ్యాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇప్పుడు నేడు జరగబోయే ఫైనల్ పోరుకు కూడా వరుణ గండం పొంచి ఉంది అని గత కొన్ని రోజుల నుంచి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. నేడు ఒకవేళ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన.. రిజర్వుడే రోజు మ్యాచ్ నిర్వహించే అవకాశం ఉంది అనుకోవడానికి కూడా లేదు.. ఎందుకంటే రిజర్వుడే రోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఒకవేళ పూర్తిగా మ్యాచ్ రద్దు అయితే ఇద్దరినీ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.


 ఇలా ఇద్దరీని సంయుక్త విజేతలుగా ప్రకటించడం వల్ల ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ మిస్ అవుతారు అని భావించిన ఐసిసి.. ఒక ఫైనల్ మ్యాచ్ కోసం రూల్స్ సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు వర్షంతో మ్యాచ్ జరగకపోతే రిజర్వు డే అయినా నవంబర్ 14వ తేదీన మ్యాచ్ కొనసాగిస్తాము అంటూ తెలిపింది. అయితే అప్పటికి వర్షం అంతరాయం కలిగిస్తే మాత్రం మరో రెండు గంటలు అదనంగా కేటాయించి కనీసం 10 ఓవర్లైన మ్యాచ్ జరిగేలా చూస్తామని ఐసీసీ తెలిపింది. ఒకవేళ అప్పటికి ఇక వరుడు అడ్డుపడితే మాత్రం ఇరుజట్లను సంయుక్త విజేతలుగా ప్రకటిస్తాం. ఇక అది మాత్రమే చివరి ఆప్షన్ కానీ ఇలా జరగడం మాకు ఇష్టం లేదు అంటూ ఐసిసి చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: