ఫైనల్ : 1992 సెంటిమెంట్ ఒక్కటే పాక్ వైపు.. రికార్డులన్ని ఇంగ్లాండ్ వైపే?

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎదురు చూస్తున్న టి20 వరల్డ్ కప్ ఫైనల్ నేడే జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. మేల్ బోర్న్ వేదికగా జరగబోతున్న ఈ మ్యాచ్ కోసం అటు ప్రేక్షకులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక వర్షం పడే అవకాశం దాదాపు 95% ఉంది అని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో ఇక మ్యాచ్ జరుగుతుందా లేకపోతే రద్దు అవుతుందా అని అనుమానాలు ఉన్నాయి అని చెప్పాలి. కానీ మ్యాచ్ జరగాలని అటు ప్రపంచం క్రికెట్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.


 ఇదిలా ఉంటే.. గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్ ప్రేక్షకులు ఒక పాత సెంటిమెంట్ ను తెరమీదికి తీసుకువచ్చి ఇక పాకిస్తాన్ జట్టు టైటిల్ విజేతగా నిలుస్తుంది అని చెబుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. 1992లో జరిగిన వరల్డ్కప్ లో కూడా పాకిస్తాన్ విషయంలో ఇలాగే జరిగిందని.. ఇక అప్పుడు ఎదుర్కొన్న ప్రత్యర్థులని ఇప్పుడు కూడా ఎదుర్కొని పాకిస్తాన్ ఫైనల్ కు చేరిందని.. ఇక ఫైనల్లో ఇంగ్లాండ్ తోనే తలబడిందని.. ఇక అప్పుడు ఇలా ఇంగ్లాండ్ ను ఓడించి  టైటిల్ విజేతగా నిలిచిన పాకిస్తాన్  ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ను నిజం చేస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.


 కానీ ఒక సెంటిమెంట్ మినహా మిగతా అన్ని రికార్డులు కూడా ఇంగ్లాండ్కే అనుకూలంగా ఉన్నాయి అన్నది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వరకు ఇరు జట్లు కూడా ముఖాముఖి 28 సార్లు టీ20 లలో తలపడ్డాయి. ఇక వాటిలో ఇంగ్లాండ్ పూర్తి ఆదిపత్యం చెలాయించింది. 18విజయాలు సాధించింది. పాకిస్తాన్ 9 విజయాలు మాత్రమే సాధించగా.. ఇక ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. ఇక ప్రపంచ కప్ లో ఇరు జట్లు తలబడిన రెండు సందర్భాల్లో ఇంగ్లాండ్ విజయం సాధించడం గమనార్హం.  ఇక టి20 ప్రపంచ కప్ కి ముందు ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య ఏడు మ్యాచ్ల టి20  సిరీస్ జరిగింది. ఈ సిరీస్లో కూడా 4-3 తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించడం గమనార్హం. ఇక ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్ కు పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్, రిజ్వాన్ లపై మంచి రికార్డు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: