1947 నుండి.. భారత్, పాక్ ను ఇంగ్లాండ్ విడదీస్తూనే ఉంది?
దీంతో మరోసారి ఫైనల్ లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉండడం ఖాయమని అందరూ భావించారు అని చెప్పాలి. ఈ క్రమంలోనె ఎంతోమంది మాజీ ఆటగాల్లు సైతం ఇక భారత్, పాకిస్తాన్ మ్యాచ్ ఉండాల్సిందే అంటూ ఇక తమ మనసులో మాట కూడా బయటపెట్టి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ ఊహించని రీతిలో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ ను ఓడిస్తుంది అనుకున్న భారత జట్టు ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది. పది వికెట్ల తేడాతో పరాజయాన్ని చదివి చూసింది టీం ఇండియా జట్టు. దీంతో అందరూ కోరుకున్నట్లుగా పాకిస్తాన్, భారత్ మధ్య కాదు పాకిస్తాన్ ఇంగ్లాండ్ మధ్య ఫైనల్ పోరు జరగబోతుంది.
ఈ క్రమంలోనే ఒక అభిమాని పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.. ఫైనల్లో భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్న ఒక అభిమాని ఇక అలా జరగకపోవడంతో తన బాధను మొత్తం ఒక పోస్ట్ రూపంలో బయట పెట్టాడు. 1947 నుంచి భారత్, పాకిస్తాన్ ను ఇంగ్లాండ్ విడదీస్తూనే ఉంది అంటూ పేర్కొన్నాడు. అంటే మన దేశాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించిన బ్రిటిషర్లు పోతూ పోతూ ఇక భారత్ పాకిస్తాన్ ను విడదీశారు. ఇక ఇప్పుడు భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందంటే దాన్ని కూడా ఇంగ్లాండ్ జరగకుండా చేసింది అని అర్థం వచ్చే విధంగా ఈ పోస్ట్ పెట్టాడు ఒక నెటిజన్.