ఇక రోహిత్ అలా చేయడం కష్టమే : గవాస్కర్

praveen
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉంటుందో అనే దానిపై అందరిలో అనుమానాలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ దూసుకు వచ్చిన టీమ్ ఇండియా జట్టు ఏకంగా సెమీఫైనల్ లో కూడా అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఇక రేపు ఇంగ్లాండు జట్టుతో సెమి ఫైనల్లో అమీతుమీ తేల్చుకోవడానికి  సిద్ధమైంది టీం ఇండియా.


 ఇక టీమిండియా ప్రస్తుతం బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవమైన ఫామ్ మాత్రం తీవ్ర స్థాయిలో జట్టును ఇబ్బంది పెడుతూనే ఉంది. మొన్నటి వరకు ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడిన కేఎల్ రాహుల్ మళ్లీ మునుపటి ఫామ్ అందుకొని వరుస హాఫ్ సెంచరీలతో అదరగొడుతున్నాడు. కానీ రోహిత్ శర్మ మాత్రం ఇంకా సింగిల్ డిజిట్ స్కోర్కె పరిమితం అవుతూ వికెట్ కోల్పోతూ ఉండడం గమనార్హం. ఇక ఇది టీమిండియాలో బ్యాటింగ్ విభాగంపై ఎంతగానో ఒత్తిడి పెంచుతుంది అని చెప్పాలి.. ఇంకా ఇదే విషయంపై ఇప్పటి వరకు ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా స్పందించారు.


 ఇక ఇటీవలే టీమ్ ఇండియా లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడంతో ఇక రోహిత్ తర్వాత వచ్చే బ్యాట్స్మెన్ లపై ఒత్తిడి పెరుగుతుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఇక అతడి ఫామ్ టీమ్ ఇండియాకు ఎంతో కీలకం అంటూ సునీల్ గవాస్కర్ చెప్పుకొచ్చాడు. నాకౌట్ మ్యాచ్లలో ప్రయోగాలు చేయలేమని జట్టులో ఉన్న ప్రతి ఒక్కరు అత్యుత్తమంగా ఆడాలి అంటూ తెలిపాడు. ఇక రోహిత్ శర్మ నాకౌట్ మ్యాచ్లో మళ్లీ మునుపటి ఫామ్  అందుకుంటాడని  ఆశిస్తున్న అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అతి దూకుడు ఆట స్వభావం రోహిత్ కు ఎప్పుడు మేలు చేయదు అంటూ సునీల్ గవస్కర్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: