కొత్త సెంటిమెంట్.. అర్షదీప్ కారణంగా టీమ్ ఇండియాకు వరల్డ్ కప్?
ఇప్పటికే 2011 వరల్డ్ కప్ సెంటిమెంట్ ప్రస్తుతం 2022 టీ20 వరల్డ్ కప్ లో కూడా రిపీట్ అవుతుంది అని ఎంతో మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే టీమిండియా ఫైనల్ చేరుతుంది అనడానికి మరో సెంటిమెంట్ ఉంది అంటూ కొత్త విషయాన్ని తెరమీదకి తీసుకువచ్చారు టీమ్ ఇండియా అభిమానులు. ఆ కొత్త సెంటిమెంట్ ఏంటో కాదు ఏకంగా టీమిండియా స్టార్ బౌలర్ అర్షదీప్ సింగ్. బుమ్రా గాయపడటంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన అర్షదీప్ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు 10 వికెట్లు తీసి టి20 వరల్డ్ కప్ లో ఎక్కువ వికెట్లు తీసిన ఆటగాడిగా టాప్ లో ఉన్నాడు.
గతంలో 2007లో లెఫ్ట్ ఆర్ ఫేసర్ ఆర్పీ సింగ్ పని 11 వికెట్లు తీసి టాపర్గా నిల్వగా ఇక ఆ వరల్డ్ కప్ లో టీం ఇండియా విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే. ఇక 2011 వన్డే వరల్డ్ కప్ లో భాగంగా జహీర్ ఖాన్ 21 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ఈ క్రమంలోనే అతని అద్భుతమైన ఆట తీరుతో టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ సొంతం అయ్యింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు అర్షదీప్ కూడా వీరి లాగానే లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ కావడం మంచి బౌలింగ్ తో అదరగొట్టడం.. ఇక ఇప్పటివరకు అందరితో పోల్చి చూస్తే ఎక్కువ వికెట్లు తీయడంతో ఈ సెంటిమెంట్ టి20 వరల్డ్ కప్ తెచ్చిపెడుతుంది అని ఎంతమంది కామెంట్లు చేస్తున్నారు.