నేడు కీలక పోరు.. ఓడితే పాక్ ఇంటికే?

praveen
టి20 వరల్డ్ లో భాగంగా అటు టైటిల్ గెలవడమె లక్ష్యంగా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు వరుసగా పరాజయాలు ఎదుర్కోవడంతో చేదు అనుభవం ఎదురైంది  అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇప్పుడు వరల్డ్ కప్ గెలవడం మాట దేవుడెరుగు..  ఏకంగా సెమిస్ లో అడుగుపెట్టే అవకాశాలను కూడా కోల్పోయే పరిస్థితి వచ్చింది. అటు జట్టు బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా ఉన్నప్పటికీ కూడా అటు పాకిస్తాన్ మాత్రమే ఎందుకో ఊహించిన రీతిలో ప్రదర్శన మాత్రం చేయలేక పోతుంది అని చెప్పాలి.



 ఇక పాకిస్తాన్ జట్టు సెమి ఫైనల్ లో అడుగు పెట్టాలి అంటే ఏదో అద్భుతం జరగాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న టీమిండియా సౌత్ ఆఫ్రికా చేతిలో ఓడిపోవడంతో ఇక పాకిస్తాన్కు సెమీఫైనల్ అవకాశాలు మరింత క్లిష్టతరంగా మారిపోయాయి అని చెప్పాలి. అయితే వరుసగా రెండు పరాజయాల తర్వాత నెదర్లాండ్స్ పై విజయం సాధించిన పాకిస్తాన్ జట్టు ఈరోజు మరో కీలక మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది అని చెప్పాలి. ఇప్పటికే సెమీస్ అవకాశాలు దాదాపు మూసుకుపోగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మాత్రం పాకిస్తాన్ ఎదురుచూస్తుంది అని చెప్పాలి.



 నెదర్లాండ్స్ పై ఎంతో అలవోకగా విజయం సాధించినప్పటికీ నేడు పాకిస్తాన్ కి అసలైన సవాలు ఎదురు కాబోతుంది. ఎందుకంటే ఒకవైపు బ్యాటింగ్లో మరోవైపు బౌలింగ్ లో కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న దిగ్గజ సౌత్ ఆఫ్రికా తో నేడు మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సిడ్ని వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా తో జరిగే మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది అంటే చాలు ఇక టోర్ని నుంచి నిష్క్రమించినట్లే అవుతుంది అని చెప్పాలి. ఒకవేళ గెలిచినా ఇతర జట్ల జయాపజాలపై పాకిస్తాన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: