ఇండియా, సౌత్ ఆఫ్రికా మ్యాచ్.. ఫిక్స్ అయింది?

praveen
ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా భారత్ దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇద్దరు సమవజీల మధ్య మ్యాచ్ జరగడంతో ఇక క్రికెట్ ప్రపంచం మొత్తం ఈ రెండు జట్ల మధ్య ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్లో చివరికి భారత జట్టు ఓటమి చవిచూసింది. మొదటి ఓటమితో  అభిమానులు అందరిని కూడా నిరాశపరిచింది అని చెప్పాలి. అయితే భారత్ గెలవాలని అటు పాకిస్తాన్ అభిమానులు కూడా కోరుకున్నప్పటికీ అది జరగలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


  అయితే ఇక దక్షిణాఫ్రికా చేతిలో భారత జట్టు ఓడిపోవడంతో అటు పాకిస్థాన్కు సెమీస్కు వెళ్లే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయాయి అని చెప్పాలి. అద్భుతాలు జరిగితే తప్ప అటు పాకిస్తాన్ సెమి ఫైనల్లో అడుగుపెట్టలేదు. ఇక ఇప్పుడు తమ జట్టు ప్రదర్శనతో పాటు ఇతర జట్ల గెలుపు ఓటములపై కూడా పాకిస్తాన్ భవితవ్యం ఆధారపడి ఉంది అని చెప్పాలి. అయితే భారత జట్టు ఓడిపోవడంపై అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే వరుసగా రెండు మ్యాచ్ లలో విజయం సాధించి దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయిన భారత్ పై కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


 ఈ క్రమంలోనే నిన్న వరల్డ్ కప్ లో భాగంగా టీమిండియా దక్షిణాఫ్రికా మధ్య జరిగిన మ్యాచ్ ముందే ఫిక్స్ అయింది అంటూ పాకిస్తాన్ అభిమానులు అందరూ కూడా ఆరోపిస్తూ ఉండడం గమనార్హం. భారత్ ఓటమితో పాకిస్తాన్ సెమీస్ అవకాశాలు గల్లంతవ్వడంతో ఇక ఇలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారత్ ప్రతి మ్యాచ్ లో బాగా ఆడుతుంది. కానీ నిన్న కావాలనే మంచి ప్రదర్శన చేయలేదు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకునేవారు. కానీ కావాలనే బ్యాటింగ్ తీసుకున్నారు. అసాధ్యమైన క్యాచ్ లను అలవోకగా పట్టే కోహ్లీ చేతిలోకి వచ్చిన క్యాచ్ ను కూడా వదిలేసాడు. అటు రోహిత్ శర్మ కావాలనే రెండుసార్లు రన్ అవుట్ చేయకుండా పక్కకి త్రో విసిరాడు. అద్భుతమైన ఫుల్ షాట్ ఆడే రోహిత్ సింపుల్ గా అవుట్ అయ్యాడు. ఇక ఎన్ని జరిగాయి అంటే తప్పకుండా భారత్ పాకిస్తాన్ మ్యాచ్ ఫిక్స్ అయింది అంటూ ఆరోపిస్తున్నారు పాక్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: