విఫలమైనా.. రోహిత్ అరుదైన ప్రపంచ రికార్డు?

frame విఫలమైనా.. రోహిత్ అరుదైన ప్రపంచ రికార్డు?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా వరుసగా విజయాలు సాధించి జోరు మీదున్న టీమిండియాకు అటు ఊహించని రీతిలో దక్షిణాఫ్రికా జట్టు బ్రేకులు వేసింది అన్న విషయం తెలిసిందే. నిన్న పెర్త్ వేదికగా జరిగిన ఉత్కంఠ భరితమైన పోరులో భారత జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలోనే భారత అభిమానులందరూ కూడా నిరాశలో మునిగిపోయారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో భారీగా పరుగులు చేస్తాడు అనుకున్న రోహిత్ శర్మ మరోసారి విఫలమయ్యాడు.


 ఎంతో సులభమైన క్యాచ్ ఇచ్చి చివరికి పేవిలియన్ చేరి అభిమానులు అందరిని కూడా  నిరాశలో ముంచేసాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇకపోతే రోహిత్ శర్మ దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో విఫలం అయినప్పటికీ ఒక అరుదైన రికార్డును మాత్రం తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. దక్షిణాఫ్రికా తో మ్యాచ్ కి ముందు వరకు కూడా టి20 వరల్డ్ కప్ లో అత్యధిక మ్యాచ్లో ఆడిన ఆటగాడిగా ఒక అరుదైన రికార్డు శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే  పేరిట ఉండేది. కానీ ఇటీవలే మాత్రం రోహిత్ శర్మ ఈ రికార్డును బ్రేక్ చేసి తన పేరుతో లిఖించుకున్నాడు అని చెప్పాలి.


 శ్రీలంక మాజీ ఆటగాడు తిలకరత్నే టి20 వరల్డ్ కప్ లో ఇప్పుడు వరకు మొత్తం 34 మ్యాచ్లు ఆడగా ఇక సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో భాగంగా హిట్ మ్యాన్ అతని రికార్డును అధిగమించాడు అని చెప్పాలి. 2007 నుంచి వరుసగా 8 వరల్డ్ కప్ టోర్నీలలో పాల్గొన్న రోహిత్ శర్మ ఈ అరుదైన ఘనతను సాధించాడు. పొట్టి ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్లో ఆడిన ఆటగాళ్ల విషయానికి వస్తే.. ఈ జాబితాలో రోహిత్ శర్మ తర్వాత తిలక రత్నే,  షకీబులసన్ 34, ఇక షాహిద్ ఆఫ్రిది, బ్రావో  33, డేవిడ్ వార్నర్ 32 మ్యాచ్లతో తర్వాత  స్థానాల్లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: