సమాన మ్యాచ్ ఫీజుపై.. హార్మన్ ప్రీత్ ఏమందో తెలుసా?
ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అని అందరూ ఎదురుచూడగా.. ఇక ఒక సరికొత్త అధ్యాయానికి ఆయన శ్రీకారం చుట్టారు అని చెప్పాలి. ఏకంగా పురుష క్రికెటర్లతో సమానంగా మహిళా క్రికెటర్లకు కూడా మ్యాచ్ ఫీజును చెల్లించేందుకు నిర్ణయించారు. ఈ క్రమంలోనే టెస్ట్ మ్యాచ్ కి 16 లక్షలు, వన్డే మ్యాచ్ కి ఆరు లక్షలు, టి20 మ్యాచ్ కి మూడు లక్షల రూపాయలు వేతనం పొందనున్నారు మహిళా క్రికెటర్లు.
అయితే బీసీసీఐ తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయంపై భారత మహిళల జట్టు కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇక టీమిండియా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం మహిళా క్రికెట్ కి ఒక శుభ పరిణామం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు ఇది జరగడం ఎంతో సంతోషంగా ఉంది అంటూ ఆనందాన్ని వ్యక్తం చేసింది హర్మన్ ప్రీత్ కౌర్. అమ్మాయిలు క్రికెట్ ని ప్రొఫెషన్ గా ఎంచుకోవడానికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఎంతోమంది మహిళా క్రికెటర్లలో ఇక బిసిసిఐ తీసుకుని నిర్ణయం మరింత ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది అంటూ హర్మన్ ప్రీత్ కౌర్ తెలిపింది.