బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇది సరికొత్త చరిత్రే?

praveen
ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆటకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల కాలంలో అయితే ప్రపంచ దేశాలలో మొత్తం క్రికెట్ ట్రెండ్ పాకి పోతుంది అని చెప్పాలి. ఇక అన్ని జట్లు అంతర్జాతీయ క్రికెట్లో తమదైన ప్రస్తానాని కొనసాగించేందుకు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉన్నాయి. అయితే కొన్ని దేశాలలో అయితే ఏకంగా క్రికెటర్లను ఆరాధ్య దైవాలుగా కూడా పూజిస్తూ ఉంటారు. ఇక ఇండియాలో క్రికెట్ కి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్రికెట్ అనేది ఒక పాశ్చాత్య దేశపు క్రీడ అయినప్పటికీ భారత ప్రజలు మాత్రం క్రికెట్ కి బాగా ఆకర్షితులు అయిపోయారు.


 ఇలా ప్రపంచ దేశాలలో రోజురోజుకు క్రికెట్ కి ఆదరణ పెరిగిపోతుంది. ఇలా ఒక్కసారి ఆటగాళ్లు ఎవరైనా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టారు అంటే చాలు ఇక కోట్ల రూపాయలు సంపాదించడం చేస్తారని.. తద్వారా వారి లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుందని అంటూ ఉంటారు. అయితే ఇలాంటి జరుగుతుంది. కానీ కేవలం పురుష క్రికెటర్ల విషయంలోనే ఇలాంటిది జరుగుతూ ఉండడం గమనార్హం. ఇప్పటికీ కూడా ఎంతోమంది మహిళా క్రికెటర్లు వివక్ష ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎందుకంటే పురుష క్రికెటర్లతో పోల్చి చూస్తే మహిళా క్రికెటర్లకు అటు మ్యాచ్ ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంటుంది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఇలా మహిళా క్రికెటర్ల పట్ల ఉన్న వివక్షను పారద్రోలేలా బీసీసీఐ ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించేందుకు  సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులపై కీలక నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఏకంగా మహిళా క్రికెటర్ల పై ఉన్న వివక్షను పారదోలుతూ వారి చెల్లింపుల్లో ఈక్విటీ విధానాన్ని అమలు చేస్తున్నట్లు బిసిసిఐ కార్యదర్శి జై షా ఇటీవల స్పష్టం చేశారు  దీంతో పురుష క్రికెటర్లతో సమానంగా మహిళ క్రికెటర్లకు టెస్ట్ మ్యాచ్ కి 15 లక్షలు, వన్డే మ్యాచ్ కి ఆరు లక్షలు, టి20 మ్యాచ్ కి మూడు లక్షలు పారితోషకంగా చెల్లించనున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: