సిక్సర్లలో రోహిత్ రికార్డు.. ఏకైక ఇండియన్ ప్లేయర్?
ఈ క్రమంలోనే ఓపెనర్ గా బరిలోకి దిగుతూ అటు టీమ్ ఇండియాకు మంచి ఆరంభాలు అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇక రోహిత్ శర్మ భారీగా పరుగులు చేశాడు అంటే చాలు అందులో సిక్సర్లే ఎక్కువగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే ఎందుకంటే ఫోర్లు కొట్టడం కంటే సిక్సర్లు కొట్టడం లోనే ఎక్కువ మజా ఉందని నమ్ముతూ ఉంటాడు రోహిత్ శర్మ. అందుకే బౌలర్ వేసిన బంతిని నేరుగా బౌండరీ అవతలికి తరలిస్తూ ఉంటాడు. రోహిత్ శర్మ బ్యాట్ నుంచి వచ్చే అద్భుతమైన సిక్సులు ప్రేక్షకులను మైమరిపింప చేస్తూ ఉంటాయని చెప్పాలి. ఇకపోతే సిక్సర్ల వీరుడుగా పేరు సంపాదించుకున్న రోహిత్ శర్మ ఇటీవల సిక్సర్లతో అరుదైన రికార్డు సృష్టించాడు.
టి20 ప్రపంచ కప్ మ్యాచ్లో భారత తరఫున అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ గా రోహిత్ శర్మ నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసాడు. ఇప్పటివరకు రోహిత్ శర్మ టి20 ప్రపంచ కప్లలో 34 సిక్సర్లు కొట్టాడు. ఇటీవల నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో మూడు సిక్సర్లు కొట్టడం ద్వారా ఈ అరుదైన రికార్డు సాధించాడు అని చెప్పాలి. అంతకుముందు ఈ రికార్డు యువరాజ్ సింగ్ (33 సిక్సర్ల) పేరిట ఉండేది. కానీ ఇప్పుడు రోహిత్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ లిస్టులో కోహ్లీ 24, ధోని 16, రైనా 12 ఉన్నారు. ఇటీవలే నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్లో మొదట కాస్త నెమ్మదిగా ఇన్నింగ్స్ ఆరంభించిన రోహిత్ శర్మ తర్వాత దాటిగా ఆడుతూ 39 బంతుల్లో 53 పరుగులు చేశాడు.