పార్టీ లేదు.. గీర్టీ లేదు.. అందరికీ క్లాస్ పీకిన రాహుల్ ద్రావిడ్?

praveen
వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ పై ఘన విజయాన్ని సాధించింది టీమ్ ఇండియా జట్టు. ఈ క్రమం లోనే నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ పై భారత్ విజయం తర్వాత దేశం మొత్తం ఎంతలా సంబరాల్లో మునిగి పోయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. ఒకరోజు ముందుగానే దీపావళి సంబరాలను సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పాలి. అయితే ఇలా మ్యాచ్ చూసిన వాళ్లే ఇక టీమిండియా విజయాన్ని  ఎంతో ఘనం గా సెలబ్రేట్ చేసుకుంటే ఇక మ్యాచ్ గెలిచిన ఆటగాళ్లు ఇంకా ఎంత ఘనంగా సెలబ్రేషన్స్ చేసుకుంటారో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు.

 కానీ టీమిండియా ఆటగాళ్లు మాత్రం అస్సలు ఎలాంటి సెలబ్రేషన్స్ చేసుకోలేదట. కనీసం చిన్న కేక్ కూడా కట్ చేయ లేదట. అయితే ఇలా ఒకవైపు పాకిస్తాన్ పై విజయంతో పాటు దీపావళిని కూడా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని భావించిన ఆటగాళ్లకు  భారత హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్  మాత్రం ఊహించని షాక్ ఇచ్చాడు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. సిడ్నీ వేదికగా గ్రాండ్ దివాళి డిన్నర్ పార్టీ ఏర్పాటు చేయగా చివరి నిమిషంలో రాహుల్ ద్రావిడ్ కారణంగా రద్దు చేశారట.

 పాకిస్తాన్ పై విజయాన్ని ఏమాత్రం సెలబ్రేట్ చేసుకోకూడదని ప్రపంచ కప్ గెలవడమే టీమిండియా అంతిమ లక్ష్యం అంటూ రాహుల్ ద్రవిడ్ అందరికీ కాస్త క్లాస్ పీకారట. వరల్డ్ కప్ గెలిచేంతవరకు కూడా పార్టీలకు దూరంగా ఉండాలని సూచించారట.  ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దని ఆటగాళ్లకు సూచించారట రాహుల్ ద్రావిడ్. అయితే సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సూచనల మేరకే రాహుల్ ద్రావిడ్ పార్టీని రద్దు చేశారని తెలుస్తుంది. కాగా టీమిండియా ఈ నెల 27వ తేదీన నెదర్లాండ్స్ తో సిడ్నీ వేదికగా మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: