
ధోని ఆరోజు కన్నీళ్లు పెట్టుకున్నాడు : కోహ్లీ
ఇలా వరల్డ్ కప్ లో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ నిలిచిన ఏకైక ఆటగాడిగా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇక ధోని కెప్టెన్సీ లో 2011 వరల్డ్ కప్ ఆడిన సమయంలో కూడా కోహ్లీ ఎంతో అద్భుతమైన బ్యాటింగ్ తో ఆకట్టుకున్నాడు. ఫైనల్ మ్యాచ్లో గౌతమ్ గంభీర్ తో కలిసి 83 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ధోనితో తన అనుబంధం గురించి చెప్పుకొడుస్తూ మహితో నా అనుబంధం స్నేహాన్ని మాటలు వర్ణించడం కష్టం.. ఎందుకంటే అందులో నమ్మకం ఉంటుంది. మేము ఎప్పుడు కలిసి బ్యాటింగ్ చేసిన పరుగులు చేయడం గురించి అస్సలు మాట్లాడుకోము. బంతి గ్యాప్లో వెళ్ళగానే మహి రెండు పరుగులు తీస్తాడని నాకు అర్థం అయిపోతుంది.
ఇక మా మధ్య గడిచిన 12 ఏళ్లలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే రన్ అవుట్స్ అయి ఉంటాయి. జట్టు కోసం ఏం కావాలో అది చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం. అందుకే మా బంధం ఆటను మించిపోయింది. ఇక నా కెరియర్ లో ధోని ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మరువలేను.. ఇక నేను కెప్టెన్ అయ్యాక కూడా ధోని మాటకు ఎంతో గౌరవం ఇచ్చా.. 2011 వరల్డ్ కప్ తర్వాత నేను జాతీయ జెండాను పట్టుకొని మహేంద్రసింగ్ ధోని హత్తుకున్నాను. ఇక ఆ మ్యాచ్ విజయం తర్వాత సచిన్ టెండూల్కర్ యువరాజ్ సింగ్ హర్భజన్ అందరూ ఎమోషనల్ అయ్యారు. మహి సాధారణంగా ఎమోషనల్ కాడు. కానీ అతని కళ్ళలో ఆ రోజు నీళ్లు చూశా. అప్పుడు వాళ్ళ ఫీలింగ్ అర్థం కాలేదు. ఎందుకంటే అప్పటికి నేను చాలా చిన్నోడిని అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.