లోకేశ్ పక్కన నడవడం గర్వంగా ఉంది.. నారా బ్రాహ్మణి ఎమోషనల్ కామెంట్స్ వైరల్!
ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రత్యేక రోజున ఆయన భార్య నారా బ్రాహ్మణి సోషల్ మీడియా వేదికగా పంచుకున్న పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. లోకేశ్‌పై తనకున్న ప్రేమను, గౌరవాన్ని చాటుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి.
తన భర్త ప్రజా సేవలో ఎంతగా నిమగ్నమయ్యారో వివరిస్తూ.. బాధ్యతతో పాటు సుదీర్ఘంగా పని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని, ఆయన చేస్తున్న ఈ త్యాగాన్ని తామంతా నిశ్శబ్దంగా గమనిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. సమాజంలో మార్పు తీసుకురావాలనే లోకేశ్ నిబద్ధత తమ కుటుంబ సభ్యులందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.
ఈ ఏడాది లోకేశ్‌కు ఎంతో ప్రశాంతంగా సాగిపోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, నిరంతరం ఆయన వెంటే ఉంటూ తోడుగా నడవడం తనకు గర్వంగా ఉందని బ్రాహ్మణి భావోద్వేగంతో రాసుకొచ్చారు. అటు రాజకీయాల్లోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ లోకేశ్ చూపిస్తున్న తెగువను ప్రతిబింబించేలా ఉన్న ఈ పోస్ట్ చూసి అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఖుషీ అవుతున్నారు.
లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతుండగా, సోషల్ మీడియా వేదికగా బ్రాహ్మణి పెట్టిన ఈ పోస్ట్ మాత్రం నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.