పాకిస్తాన్తో మ్యాచ్.. ఆ ఇద్దరు ఉండాల్సిందేనంటున్న గవాస్కర్?

praveen
టి20 వరల్డ్ కప్ లో భాగంగా అటు టీమ్ ఇండియా ప్రస్థానం మొదలు పెట్టడానికి ఇంకా ఎన్నో రోజులు మిగిలి లేదు. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్లో మునిగి తేలిన టీమిండియా ఎంతో పటిష్టంగా కనిపిస్తుంది అని చెప్పాలి. పలువురు కీలక ఆటగాళ్లు దూరమైనప్పటికీ జట్టులో సెలెక్ట్ అయిన మిగతా ప్లేయర్లందరూ కూడా అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతూ ఉండడం అటు టీమిండియా కు ఎంతగానో కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలిచేలాగే కనిపిస్తోంది.


 అంతే కాదు కెప్టెన్ రోహిత్ తన వ్యూహాలతో వరల్డ్ కప్ లో మ్యాజిక్ చేస్తాడని భారత క్రికెట్ ప్రేక్షకులు కూడా బలంగా నమ్ముతున్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే టీమిండియా తుది జట్టులో ఇద్దరి స్థానంపై మాత్రం గత కొన్ని రోజుల నుంచి తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి జట్టులో మిడిల్ ఆర్డర్ లో నమ్మకమైన బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్... ఐపిఎల్ ద్వారా అనూహ్యమైన ప్రదర్శనతో జట్టులోకి వచ్చి అదరగొడుతున్నాడు దినేష్ కార్తీక్ వీరిద్దరిలో ఎవరు తుదిజట్టులో ఉంటారు అనే విషయంపై చర్చ జరుగుతుంది.

 కొంత మంది రిషబ్ పంత్ ఉంటే బాగుంటుందని భావిస్తే ఇంకొంతమంది దినేష్ కార్తీక్ అయితే టీమిండియా కు ఉపయోగపడతాడు అని అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్లో రిషబ్ పంత్ దినేష్ కార్తీక్ లను ఆరు ఏడు స్థానాలలో ఆడించాలని సూచించాడు. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను ఐదవ బౌలర్గా వినియోగించుకోవాలి అంటూ తెలిపాడు. ఐదుగురు బ్యాట్స్మెన్లు నలుగురు బౌలర్లు ఇద్దరు ఆల్రౌండర్లతో టీమిండియా పాకిస్తాన్ తో మ్యాచ్లో బరిలోకి దిగాలి అంటూ సూచించాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: