వామ్మో.. పరుగు కోసం.. బ్యాటర్ పడిన కష్టం చూస్తే నవ్వాగదు?
ఇలా మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఏదైనా ఫన్నీ సన్నివేశం జరిగింది అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇక్కడ ఇలాంటి తరహా ఘటనకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. సాధారణంగా క్రిజులో ఉన్న బ్యాట్స్మెంటు వేగంగా పరుగులు తీయడం ఇప్పటివరకు చూశాము. కొన్ని కొన్ని సార్లు ఇక పరుగులు తీయడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూస్తే క్రీజు లో వికెట్ల మధ్య పరుగులు తీయడం ఇంత కష్టమ అని అనిపిస్తూ ఉంటుంది.
అంతేకాదు ఇక ఈ వీడియో చూస్తున్నంత సేపు క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా కడుపుబ్బా నవ్వుకుంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. యూరోపియన్ క్రికెట్ లీగ్ లో భాగంగా ఈ ఆసక్తికర ఘటన జరిగింది. స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న ఆటగాడు ఆఫ్ సైడ్ అవతల వెళ్తున్న బంతిని మిడాన్ దిశగా ఆడాడు. అయితే సింగిల్ తీసే ఛాన్స్ ఉండడంతో వెంటనే నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న తన సహచర ఆటగాడిని పరుగు కోసం పిలిచాడు. అయితే సింగిల్ ను తొందరగా పూర్తి చేసే క్రమంలో పిచ్ మధ్యలోనే బ్యాలెన్స్ కోల్పోయి జారిపడ్డాడు. రనౌట్ తప్పదు అనుకుని ఊరుకున్నాడు. కానీ అదే సమయంలో ఫీల్డర్ త్రో మిస్ కావడంతో పడిపోయిన బ్యాటర్ మళ్ళీ లేచి పరిగెత్తి చివరికి ఎంతో కష్టపడి రన్ పూర్తి చేశాడు. టోర్నీలో భాగంగా గ్రీన్ టీమ్, బ్లూ టీ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన జరిగింది.