హ్యాట్రిక్ కొట్టిన కార్తీక్.. ఎవరో కాదు మనోడే?
ఇక ఈ మ్యాచ్ లో భాగంగా శ్రీలంక గెలిస్తేనే వరల్డ్ కప్ లో నిలిచే పరిస్థితి నెలకొంది. ఇలాంటి సమయంలోనే ఇక మంచి ప్రదర్శన కనబరిచిన శ్రీలంక జట్టు యూఏఈ జట్టుపై విజయం సాధించింది అని చెప్పాలి. విజయమైతే శ్రీలంక జట్టుకు వరించింది. కానీ అటు రికార్డులు మాత్రం యూఏఈ జట్టుకు చెందిన ఆటగాళ్ళే కొట్టారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో తొలి హ్యాట్రిక్ నమోదు చేశాడు యూఏఈ స్పిన్నర్ కార్తీక్. దీంతో ఈ యువ బౌలర్ పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
అయితే ప్రస్తుతం కార్తీక్ మేయప్పన్ గురించి ఒక వార్త కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.కార్తీక్ మేయప్పన్ ఎవరో కాదు భారత సంతతికి చెందిన యువకుడే అన్నది తెలుస్తుంది. అంతేకాదు అతను పుట్టింది కూడా ఇండియాలోనే. అక్టోబర్ 8, 2000 సంవత్సరంలో తమిళనాడు రాజధాని చెన్నైలో పుట్టాడు కార్తీక్. అతని పూర్తిపేరు కార్తీ పలనియప్పన్ మేయ్యప్పన్. ఇతడి కుటుంబం 2012లో దుబాయిలో సెటిల్ కావడంతో ఇక అతని కెరియర్ యూఏఈ జట్టులో ప్రారంభించాడు. 2019లో యూఏఈ జట్టులోకి అరంగేట్రం చేసిన కార్తీక్ 8వన్డేలు, 12 టీ20 మ్యాచ్ లు ఆడాడు.